చెయ్యి విరిగిందని కృష్ణుడి విగ్రహానికి పట్టీ కట్టిన వైద్యులు

ABN , First Publish Date - 2021-11-19T23:57:15+05:30 IST

లేఖ్ సింగ్ అనే పూజారి.. శుక్రవారం ఉదయం కృష్ణుడి విగ్రహానికి స్నానం చేయిస్తుండగా పొరపాలుగా విగ్రహం చెయ్య భాగం దెబ్బతిన్నది. అంతే ఆ విగ్రహాన్ని తీసుకుని పరుగు పరుగున ఆగ్రా జిల్లా ఆసుత్రికి చేరుకున్నాడు. అయితే కృష్ణుడికి వైద్యం చేయాలని అడిగితే మొదట తనను ఎవరూ పట్టించుకోలేదని వాపోయాడు..

చెయ్యి విరిగిందని కృష్ణుడి విగ్రహానికి పట్టీ కట్టిన వైద్యులు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బందికి శుక్రవారం ఆశ్యర్యపోయే సంఘటన ఎదురైంది. కృష్ణుడి విగ్రహం చెయ్యి భాగం విరిగిందని, దానికి కట్టు కట్టాలంటూ ఒక పూజారి వచ్చి అడగడంతో వారంతా అవాక్కయ్యారు. అయితే పూజారి తీవ్ర దు:ఖంలో కట్టుకట్టమని వేడుకోవడంతో విరిగిన కృష్ణుడి విగ్రహం చెయ్యికి కట్టు కట్టి పంపించారు. అయితే ఇదంతా సదరు పూజారిని సంతృప్తి పరిచేందుకే అలా చేశామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.


లేఖ్ సింగ్ అనే పూజారి.. శుక్రవారం ఉదయం కృష్ణుడి విగ్రహానికి స్నానం చేయిస్తుండగా పొరపాలుగా విగ్రహం చెయ్య భాగం దెబ్బతిన్నది. అంతే ఆ విగ్రహాన్ని తీసుకుని పరుగు పరుగున ఆగ్రా జిల్లా ఆసుత్రికి చేరుకున్నాడు. అయితే కృష్ణుడికి వైద్యం చేయాలని అడిగితే మొదట తనను ఎవరూ పట్టించుకోలేదని వాపోయాడు. తీవ్ర దు:ఖంలో వైద్యులను వేడుకుంటే పట్టీ కట్టారని లేఖ్ సింగ్ తెలిపారు.


కాగా, ఈ విషయమై ఆగ్రా జిల్లా ఆసుపత్రి ఛీఫ్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ అశోక్ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘ఆ పూజారి దేవతా విగ్రహం తీసుకుని వచ్చి వైద్యం చేయమని కోరాడు. అతడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ పూజారి సెంటిమెంట్‌ను పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది. పూజారి సూచన మేరకు ‘శ్రీ క్రిష్ణ’ పేరుతో విగ్రహా పేరు నమోదు చేసుకుని, అతడి సంతృప్తి కోసం విగ్రహానికి పట్టీ కట్టి పంపించాం’’ అని అన్నారు.

Updated Date - 2021-11-19T23:57:15+05:30 IST