Golden Visa: వైద్యులకు యూఏఈ గోల్డెన్ ఛాన్స్!

ABN , First Publish Date - 2021-07-29T17:26:15+05:30 IST

గల్ప్ దేశం యూఏఈ వైద్యులకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది. పదేళ్ల కాలపరిమిత గల గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది.

Golden Visa: వైద్యులకు యూఏఈ గోల్డెన్ ఛాన్స్!

అబుధాబి: అరబ్ దేశం యూఏఈ వైద్యులకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది. పదేళ్ల కాలపరిమిత గల గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. యూఏఈ హెల్త్ అథారిటీ లైసెన్స్ గల వైద్యులు జూలై 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అక్కడి సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ smartservices.ica.gov.ae ద్వారా వైద్యులు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించించారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత అర్హులైన వారిని గుర్తించి గోల్డెన్ వీసా మంజూరు చేస్తామని పేర్కొంది. 


దుబాయ్ రూలర్, యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల అధిక నైపుణ్యం గల వైద్యులు తమ దేశానికి సేవ చేసే వీలు ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇక వివిధ రంగాల్లో దేశానికి విశేష కృషి చేసిన వ్యక్తులకు యూఏఈ 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పరిమితితో గోల్డెన్ వీసా జారీ చేస్తోంది. ఇటీవల కోడర్స్ కూడా యూఏఈ గోల్డెన్ వీసా జారీ చేయడం ప్రారంభించింది. నేషనల్ ప్రొగ్రాం ఫర్ కోడర్స్ పేరిట ఇప్పటికే లక్ష మందికి గోల్డెన్ వీసా మంజూరు చేసింది. గోల్డెన్ వీసా పొందిన వారు తమ ఫ్యామిలీతో కలిసి యూఏఈలో 10 ఏళ్ల పాటు నివాసముండే అవకాశం ఉంటుంది.   


Updated Date - 2021-07-29T17:26:15+05:30 IST