Lucknow: బాలిక కడుపులో 2 కిలోల జుట్టు

ABN , First Publish Date - 2021-09-04T14:46:46+05:30 IST

ఓ బాలిక కడుపులో నుంచి 2 కిలోల వెంట్రుకలను తొలగించిన అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో వెలుగుచూసింది....

Lucknow: బాలిక కడుపులో 2 కిలోల జుట్టు

ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు

లక్నో (ఉత్తరప్రదేశ్): ఓ బాలిక కడుపులో నుంచి 2 కిలోల వెంట్రుకలను తొలగించిన అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో వెలుగుచూసింది. 17 ఏళ్ల వయసు గల బాలిక ట్రైకోబెజోవర్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ వెంట్రుకలను తినేది. 10 రోజుల క్రితం బాలిక వాంతులు,కడుపునొప్పి సమస్యతో బలరాంపూర్ ఆసుపత్రికి వచ్చింది. బాలిక పొత్తికడుపు పై భాగంలో పెద్ద వాపు కనిపించడంతో అల్ట్రాసౌండ్ ఎక్సేరే, సీటీ స్కాన్, ఎండోస్కోపీ చేయగా లోపల జుట్టు ఉందని తేలింది. దీంతో డాక్టర్ సమద్దర్ తోపాటు వైద్యుల బృందం బాలికకు శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులోనుంచి 20 సెంటీమీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల వెడల్పు గల 2 కిలోల జుట్టును తొలగించారు. 


బాలిక కడుపులోపల రాతి బంతి రూపంలో జుట్టు పేరుకుపోయిందని వైద్యులు చెప్పారు. జట్టు వల్ల ఆహారం బాలిక కడుపులో లేకుండా ఉండటం వల్ల బలహీన పడి 32 కిలోలకు తగ్గిందని వైద్యులు చెప్పారు.ఆపరేషన్ అనంతరం బాలిక నాలుగైదు రోజుల్లో కోలుకుంటుందని డాక్టర్ సమద్దర్ చెప్పారు. డిప్రెషన్, మానసిక సమస్యతో జట్టును తింటారని, ఆపరేషన్ అనంతరం బాలికకు కౌన్సెలింగ్ చేస్తున్నామని వైద్యులు చెప్పారు.


Updated Date - 2021-09-04T14:46:46+05:30 IST