వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన గర్భిణి.. స్కానింగ్ చేసి ఖంగుతిన్న వైద్యులు.. ఆస్పత్రి బిల్లు చూస్తే పదిన్నర కోట్లు..

ABN , First Publish Date - 2021-10-24T22:11:03+05:30 IST

ఆ దంపతులకు అప్పటికే ఓ కుమార్తె ఉంది. రెండో సారి గర్భం దాల్చడంతో పరీక్షల నిమిత్తం.. ఆస్పత్రికి వెళ్లారు. స్కానింగ్ చేసిన వైద్యులు కడుపులో పిల్లలను చూసి ఖంగుతిన్నారు. ఆపరేషన్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.

వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన గర్భిణి.. స్కానింగ్ చేసి ఖంగుతిన్న వైద్యులు.. ఆస్పత్రి బిల్లు చూస్తే పదిన్నర కోట్లు..

ఆ దంపతులకు అప్పటికే ఓ కుమార్తె ఉంది. రెండో సారి గర్భం దాల్చడంతో పరీక్షల నిమిత్తం.. ఆస్పత్రికి వెళ్లారు. స్కానింగ్ చేసిన వైద్యులు కడుపులో పిల్లలను చూసి ఖంగుతిన్నారు. ఆపరేషన్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. డాక్టర్లు చెప్పిన వార్త విని సంతోషించాలో, బాధపడాలో తెలీని పరిస్థితిలో ఉన్నారు తల్లిదండ్రులు. మరోవైపు పిల్లల పోషణ, చదువు తదితర ఖర్చుల గురించి ఆందోళన చెందుతున్నారు. ఇంతలో పుండు మీద కారం అన్నట్లుగా.. ఆస్పత్రి బిల్లు ఏకంగా పదిన్నర కోట్లు వేశారు. ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..  


మాలి అనే దేశంలో నివాసం ఉంటున్న కాదర్, హలీమా దంపతులకు ఓ కుమార్తె ఉంది. రెండో సారి గర్భం దాల్చగా.. వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారు. పరిశీలించిన వైద్యులు.. ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉండొచ్చని చెప్పారు. అయితే నెలలు నిండే కొద్దీ పొట్ట భారీగా పెరిగింది. డెలివరీ సమయం దగ్గర పడుతుండడంతో మొరాకో అనే దేశానికి వచ్చారు. ఈ క్రమంలో పరీక్షల నిమిత్తం మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్లు స్కానింగ్ చేసి ఖంగుతిన్నారు.


ఏకంగా తొమ్మిది మంది సంతానం ఉండడంతో నెలలు నిండకుండానే ఆపరేషన్ చేసి, అందరినీ సురక్షితంగా బయటికి తీశారు. వీరిలో నలుగురు మగపిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే నెలలు నిండకుండా ప్రసవించడంతో ఇంక్యుబేటర్‌లో పెట్టారు. ప్రస్తుతం వారికి పదిన్నర కోట్ల రూపాయల( మన కరెన్సీలో) బిల్లు వేశారు. అంతమంది పిల్లలు పుట్టింనందుకు తల్లిదండ్రులకు సంతోషించాలో, బాధపడాలో అర్థం కావడం లేదు. వారి పోషణ గురించి తలుచుకుని ఆవేదన చెందుతున్నారు.


మగ పిల్లలకు ఒమర్, ఎల్హద్జీ, బాహ్, మొహమ్మద్ అని, ఆడ పిల్లలకు  అడామా, ఒమౌ, హవా, కడిడియా, ఫాతౌమ అని పేరు పెట్టారు. ఇదిలా వుండగా పిల్లల పోషణకు ప్రస్తుతం రోజూ ఆరు లీటర్ల పాలు, 100 డైపర్లు అవసరమవుతున్నాయని చెబుతున్నారు. అప్పటికే వారికి ఓ కుమార్తె ఉండడంతో మొత్తం పది మందిని పోషించడం భారంగా మారుతోందని వాపోతున్నారు.


ఆస్పత్రి బిల్లులకే ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేదని.. అయితే అందులో ఎక్కువ శాతం మాలి ప్రభుత్వమే భరించిందని చెప్పారు. ఇంటికి వెళ్లాక తాము ఎలా జీవించాలని ఆవేదన చెందుతున్నారు. పిల్లల పోషణ, చదువు తదితర అవసరాల విషయంలో ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మరి ఈ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Updated Date - 2021-10-24T22:11:03+05:30 IST