70 ఏళ్ల వృద్ధురాలికి మోకీలు మార్పిడి

ABN , First Publish Date - 2022-08-26T17:05:17+05:30 IST

యశోద ఆస్పత్రిలో ఆర్థోపెడిక్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ టి. దశరథరామారెడ్డి ఆధ్వర్యంలో మొదటి సారి రోబోటిక్‌ పద్ధతిలో మోకాలి చిప్ప మార్పిడిని

70 ఏళ్ల వృద్ధురాలికి మోకీలు మార్పిడి

రోబోటిక్‌ పద్ధతిలో సర్జరీ చేసిన వైద్యులు

హైదరాబాద్‌ సిటీ: యశోద ఆస్పత్రిలో ఆర్థోపెడిక్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ టి. దశరథరామారెడ్డి ఆధ్వర్యంలో మొదటి సారి రోబోటిక్‌ పద్ధతిలో మోకాలి చిప్ప మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు మోకాలి నొప్పితో బాధపడుతూ డాక్టర్‌ను సంప్రందించారు. ఆమెకు మోకాలి మార్పిడి చేయాలని సూచించారు. గురువారం సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో వృద్ధురాలికి ఆధునిక ప్రక్రియ రోబోటిక్‌ శస్త్రచికిత్స పద్ధతిలో ఎడమ కాలు మోకీలును మార్పిడి చేశారు. సాధారణంగా ఓపెన్‌ చికిత్స ప్రక్రియలో మార్పిడి చేస్తారు. వయస్సు ఎక్కువగా ఉండడంతో నొప్పిలేకుండా, త్వరగా కొలుకునే విధంగా రోబోటిక్‌ పద్ధతిలో చికిత్స చేసినట్టు డాక్టర్‌ దశరథరామారెడ్డి చెప్పారు. ఈ పద్ధతిలో శరీరంపై కోత కచ్చితంగా అవసరమైన పరిమాణం మేరకే ఉంటుందని, ఒక మిల్లీ మీటర్‌ కూడా తేడా రాదన్నారు. సర్జరీకి దాదాపు 80 నిమిషాల సమయం పట్టిందని తెలిపారు.

Updated Date - 2022-08-26T17:05:17+05:30 IST