జీజీహెచ్‌ను సందర్శించిన వైద్యులు

ABN , First Publish Date - 2022-07-06T05:37:49+05:30 IST

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని మంగళవారం సిద్దిపేటకు చెందిన వైద్యబృందం డీఎంహెచ్‌వో నేతృత్వంలో సందర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ ఆసుపత్రిలో వివిధ విభాగాలలో జరుగుతున్న వైద్య పరీక్షలు, సర్జరీలు, ఆక్సిజన్‌ ప్లాంట్‌, ఐసీయూ, ఎమర్జెనీ ఇన్సెంటివ్‌ కేర్‌, మెడికల్‌ విభాగాలను వారు పరిశీలించారు. ఆసుపత్రి నిర్వహణ, పరిశుభ్రత వంటి పలు అంశాలను పరిశీలించి వీటిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అమలు చేయనున్నట్లు వైద్యబృందం తెలిపారు.

జీజీహెచ్‌ను సందర్శించిన వైద్యులు

పెద్దబజార్‌, జూలై 5: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని మంగళవారం సిద్దిపేటకు చెందిన వైద్యబృందం డీఎంహెచ్‌వో నేతృత్వంలో సందర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ ఆసుపత్రిలో వివిధ విభాగాలలో జరుగుతున్న వైద్య పరీక్షలు, సర్జరీలు, ఆక్సిజన్‌ ప్లాంట్‌, ఐసీయూ, ఎమర్జెనీ ఇన్సెంటివ్‌ కేర్‌, మెడికల్‌ విభాగాలను  వారు పరిశీలించారు. ఆసుపత్రి నిర్వహణ, పరిశుభ్రత వంటి పలు అంశాలను పరిశీలించి వీటిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అమలు చేయనున్నట్లు వైద్యబృందం తెలిపారు. ఇటీవల ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు జీజీహెచ్‌ను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో నిజామాబాద్‌ జీజీహెచ్‌ నిర్వహణ, వైద్యసేవలను పరిశీలించాల్సిందిగా సిద్దిపేట వైద్య బృందాన్ని  పంపినట్లు వారు తెలిపారు. హరీష్‌రావు సూచనల మేరకు తాము జీజీహెచ్‌ పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. మంత్రి హరీష్‌రావు చెప్పినదానికంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఉన్నాయని, పేషెంట్లకు అందిస్తున్న సేవలు కార్పొరేట్‌ స్థాయిలో ఉన్నాయని నిజామాబాద్‌ ఆసుపత్రి మోడల్‌ ఆసుపత్రిగా ఉ న్నదని సంతృప్తి వ్యక్తం చేశారు. 

జిల్లాలో సిద్దిపేట వైద్యబృందం పర్యటన..

జిల్లాలో బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్‌, వేల్పూరులోని పీహెచ్‌సీలను సిద్దిపేట వైద్యబృందం మంగళవారం పర్యటించారు. ఆక్సీజన్‌ప్లాంట్‌ నిర్మానం, మౌళికసదుపాయాలు, నూతనంగా నిర్మిస్తున్న పీహెచ్‌సీలను సైతం పరిశీలించారు. 

Updated Date - 2022-07-06T05:37:49+05:30 IST