Benefits of Green Tea: హృదయ వ్యాధులను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందా? గ్రీన్ టీతో ఏడు ప్రయోజనాలు..

ABN , First Publish Date - 2022-08-30T20:27:52+05:30 IST

గ్రీన్ టీ బరువు పెరగడాన్ని తగ్గించడంలో, పెరుగుతున్న ఊబకాయం సమస్యను అధిగమించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Benefits of Green Tea: హృదయ వ్యాధులను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందా? గ్రీన్ టీతో ఏడు ప్రయోజనాలు..

మనకు ఉదయాన్నే గ్రీన్ టీ తీసుకోవడం ఇప్పుడు మామూలు అలవాటుగా మారిపోయింది. బలమైన కారణాలతోనే ఈ టీ కి మనం అలవాటు పడ్డాం. దీనిని తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించవచ్చనో లేక ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుందనో గ్రీన్ టీని తాగుతున్నవారు ఉన్నారు. అయితే ఈ గ్రీన్ టీతో చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు డాక్టర్స్.. హెల్త్ డ్రింక్స్, గ్రీన్ టీ విషయానికి వస్తే ఇది యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండి, అధిక బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. 


1. మెదడు పనితీరులో సహాయపడుతుంది: వ్యాధులను నివారించడం, కణాలను రక్షించడమే కాకుండా, గ్రీన్ టీ మనస్సుకు కూడా మేలు చేస్తుంది. దీనిలోని కెఫీన్ మనలో ఉత్తేజాన్ని నింపుతుంది.  అంతేకాదు ఇది మెరుగైన మానసిక స్థితిని, జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ టీలో అమైనో ఆమ్లం L-థియనైన్ కూడా ఉంటుంది, ఇది కెఫిన్‌తో కలిసి పని చేస్తుంది.


2. హృదయ వ్యాధులను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది: గ్రీన్ టీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది అలాగే LDL కణాలను కాపాడుతుంది. ఈ టీని రోజూ తీసుకునేవారికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశోధనలు నిరూపించాయి.


3. క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది: క్యాన్సర్ ఇప్పటికీ మానవ జీవితానికి పెద్ద ముప్పుగా మారిపోయింది. ఇది యాంటీఆక్సిడెంట్ల స్థాయిని పెంచడంలో సహకరిస్తుంది. రొమ్ము, కొలొరెక్టల్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి హానికరమైన క్యాన్సర్ వ్యాధులను తగ్గించడంలో ఈ టీ సహాయపడుతుంది.


4. వృద్ధాప్య వ్యాధుల నుండి రక్షిస్తుంది: గ్రీన్ టీ మెదడును వృద్ధాప్యం నుండి రక్షిస్తుంది. ఇందులోని కాటెచిన్ ఆర్గానిక్స్ మెదడును రక్షించడంలో సహాయపడుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది, దీనివల్ల పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.


5. వివిధ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది: గ్రీన్ టీలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లను నిరోధించే ఆర్గానిక్‌ లు ఉంటాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడంలో, ఇన్‌ఫ్లుఎంజా వంటి ఇన్‌ఫెక్షన్‌లు లేదా వైరస్‌లు తగ్గించడంలో ఈ కాటెచిన్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.


6. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: మధుమేహం ఇప్పుడు అందరిలో కామన్ గా వచ్చ వ్యాధి. దీనికి చక్కెర స్థాయి పెరగడం కూడా ఒక కారణం. గ్రీన్ టీ ఇన్సులిన్ శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది అని పరిశోధనలు చెపుతున్నాయి.


7. ఊబకాయాన్ని అధిగమించడానికి సహాయపడుతుంది: గ్రీన్ టీ బరువు పెరగడాన్ని తగ్గించడంలో, పెరుగుతున్న ఊబకాయం సమస్యను అధిగమించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 


అమెరికన్ జెరియాట్రిక్స్ సొసైటీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, 60 సంవత్సరాల వయస్సులో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించగలుగుతారని చెపుతున్నాయి.

Updated Date - 2022-08-30T20:27:52+05:30 IST