how healthy it is: నిమ్మకాయ రొమ్ము క్యాన్సర్ కణాలను తొలగిస్తుందా?.

ABN , First Publish Date - 2022-09-11T18:08:59+05:30 IST

నిమ్మకాయలో విటమిన్ సి 187% ఉంటుంది, ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సమర్థవంతంగా చేస్తుంది.

how healthy it is: నిమ్మకాయ రొమ్ము క్యాన్సర్ కణాలను తొలగిస్తుందా?.

నిమ్మకాయలు పూర్తిగా పోషక లక్షణాలను, ఔషధ స్వభావాన్ని కలిగి ఉంటాయి. నిజానికి, కాయలోకన్నా కూడా పై తొక్క ఎంతో ఆరోగ్యకరమైనది. నిమ్మకాయల్లో థయామిన్, రిబోఫ్లావిన్, ఐరన్, మెగ్నీషియం, వంటి విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది దగ్గు, జలుబు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంటువ్యాధులు నుండి రక్షించే ఒక యాంటీబయాటిక్ గా కూడా పనిచేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి 187% ఉంటుంది, ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సమర్థవంతంగా చేస్తుంది. 


1. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ సంఖ్యను తగ్గించడంలో కూడా శక్తివంతంగా పనిచేస్తుంది. 

2. రక్తనాళాలకు నష్టం జరగకుండా చూస్తుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా సహాయపడుతుంది.

3. నిమ్మకాయలో ఉండే లిమోనాయిడ్స్, రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపుతుంది. 

4. నిమ్మకాయ తొక్కలో రసం కంటే 5 నుండి 10 రెట్లు ఎక్కువ విటమిన్లు ఉన్నాయి.

5. విటమిన్ B6, కాల్షియం, పొటాషియం, రాగి, ఫోలేట్, పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. 

6. నిమ్మకాయ శక్తివంతమైన యాంటీ మైక్రోబియల్, యాంటీ బాక్టీరియల్ పండు. 

7. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్‌లను నిరోధించడంలో సహాయపడతాయి. 


మామూలుగా నిమ్మకాయలను ఇంట్లో ఎలా నిల్వ చేసుకుంటారు? 

నిమ్మకాయలను ఫ్రీజర్ లో ఉంచడం వల్ల పండులోని సహజమైన గుణాలు పోయే అవకాశం ఉంటుంది. నిమ్మకాయలను గాలి తగిలేట్టు ఉంచడమే మంచిది. 

Updated Date - 2022-09-11T18:08:59+05:30 IST