నాని అందుకు ఒప్పుకోవడం లేదా..?

Apr 22 2021 @ 11:50AM

నేచురల్ స్టార్ నాని నటించిన 'టక్ జగదీష్' రిలీజ్ డేట్ అనౌన్స్ అయి కూడా మళ్ళీ పొస్ట్‌పోన్ చేయాల్సి వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో ఒక్క నాని సినిమాను మాత్రమే కాదు పలు మీడియం అండ్ భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దాంతో మళ్ళీ కొన్ని సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఆయా చిత్ర దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే నాని నటించిన తాజా చిత్రం 'టక్ జగదీష్' కూడా ఓటీటీలో రిలీజ్ చేద్దామన్న ప్రస్తావన నాని దగ్గర తీసుకు వచ్చారట. కానీ నాని అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. నాని నటించిన గత చిత్రం 'వి' కూడా కరోనా కారణంగా థియేటర్స్ మూత పడి ఉండటంతో ఓటీటీలో రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాధరణ పొందలేకపోయింది. 

 

ఈ కారణమా..లేక మరేదైనా కారణమా తెలియదు గానీ.. లేటయినా 'టక్ జగదీష్' థియేటర్స్‌లోనే రిలీజే చేద్దామని మేకర్స్‌కి నాని సూచించాడట. కాగా నాని నటిస్తున్న 'శ్యామ్ సింఘరాయ్' సినిమా షూటింగ్ దశలో ఉంది. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక రీసెంట్‌గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని - నజ్రియా జంటగా నటిస్తున్న 'అంటే..సుందరానికి' సినిమా సెట్స్ మీదకి వచ్చిది. నాని ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అయితే ఈ ఏడాదిలోనే మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. చూడాలి మరి నాని ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా లేదా.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.