కుక్క దాడి: చిన్నారికి గాయాలు

Published: Mon, 28 Mar 2022 01:01:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon

రాయవరం, మార్చి 27: కుక్క విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో నాలుగు సంవత్సరాల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. రాయవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన దేవగుప్తపు మహేష్‌ దంపతులు స్థానిక చెరువుగట్టు సమీపంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం వారి నాలుగు సంవత్సరాల కుమార్తె సత్యశ్రీ ఇంటి బయట ఆడుకుంటోంది. ఈ సమయంలో ఒక కుక్క చిన్నారిని ఇంటి వద్ద నుంచి రోడ్డుపైకి లాక్కొచ్చింది. చిన్నారి నుదురు, తలపై తీవ్రంగా గాయాలయ్యాయి. చిన్నారి ఇంటి సమీపంలో ఇల్లు నిర్మిస్తున్న పది మంది తాపీపనివాళ్లు కుక్క దాడి నుంచి చిన్నారిని విడిపించే ప్రయత్నం చేశారని స్థానికులు తెలిపారు. బాలికను కుటుంబ సభ్యులు రాయవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. శనివారం ఇందిరా కాలనీ వైపునకు వెళ్తున్న వ్యక్తిపైన ఇదే కుక్క దాడి చేసి గాయపర్చినట్టు స్థానికులు తెలిపారు. ఇద్దరిపై దాడిచేసిన కుక్కను  పిచ్చి కుక్కగా భావించి స్థానికులు హతమార్చారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.