Viral Video: కుక్కపై ఇంత క్రూరత్వమా...?

ABN , First Publish Date - 2022-09-19T15:32:09+05:30 IST

ఓ కుక్కను(Dog) దారుణంగా హింసించిన ఘటన రాజస్థాన్( Rajasthan) రాష్ట్రంలోని జోధ్‌పూర్(Jodhpur) నగరంలో తాజాగా వెలుగుచూసింది.....

Viral Video: కుక్కపై ఇంత క్రూరత్వమా...?

జైపూర్ (రాజస్థాన్): ఓ కుక్కను(Dog) దారుణంగా హింసించిన ఘటన రాజస్థాన్( Rajasthan) రాష్ట్రంలోని జోధ్‌పూర్(Jodhpur) నగరంలో తాజాగా వెలుగుచూసింది.జోధ్‌పూర్ నగరానికి చెందిన డాక్టర్ రజనీష్ గ్వాలా కుక్కను తాడుతో కారుకు కట్టి(Dog chained) వేగంగా నడుపుతూ లాక్కెళ్లిన(dragged) ఘటన వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. రద్దీగా ఉన్న జోధ్‌పూర్‌ నగరంలోని శాస్త్రినగర్ రోడ్డుపై పట్టపగలు కారును(car) వేగంగా నడుపడంతో కుక్క కారు వేగానికి అందుకోలేక అటు ఇటూ ఊగుతూ రోడ్డుపై సతమతమైంది. కుక్కను రోడ్డుపై కారుతో ఈడ్చుకెళుతూ కారు యజమాని అయిన డాక్టర్ రజనీష్ గ్వాలా(Dr. Rajneesh Gwala) కనికరం లేకుండా వ్యవహరించారు.ఈ వీడియోను కారును వెంబడిస్తున్న మరో వాహనంలోని ప్రయాణికులు చిత్రీకరించారు.


కుక్క నోటికి గుడ్డ కూడా కట్టి ఉంది. మోటారు సైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తి కారును ఓవర్ టేక్ చేసి డ్రైవర్‌ను బలవంతంగా ఆపడానికి యత్నించాడు. జంతువు హింసకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. కుక్కను కారుతో రోడ్డుపై ఈడ్చుకెళ్లిన వీడియోను సోషల్ మీడియాలో జోధ్‌పూర్ డాగ్ హోం ఫౌండేషన్ పోస్టు చేసింది.ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చక్కర్లు కొడుతోంది.(Video viral)జంతు హింసకు పాల్పడిన వ్యక్తిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కారుతో ఈడ్చుకెళ్లడం వల్ల కుక్కకు తీవ్ర గాయాలయ్యాయి.(multiple fractures)


 దీంతో స్థానికులు కుక్కకు చికిత్స చేయించేందుకు అంబులెన్స్‌ను కూడా రప్పించారు.అనంతరం స్థానికులు ఈ సంఘటన గురించి జోధ్‌పూర్ నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ డాగ్ హోమ్ ఫౌండేషన్‌కు సమాచారం అందించారు.కుక్కను క్రూరంగా హింసించిన డాక్టర్ రజనీష్ గ్వాలాపై కేసు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలని జోధ్ పూర్ పోలీసు కమిషనరుకు ట్వీట్ లో కోరారు. దీంతో డాక్టరుగా రజనీష్ లైసెన్సును రద్దు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత జాన్ అబ్రహాం, జంతుప్రేమికురాలు మనేకా గాంధీలకు డాగ్ హోమ్ ఫౌండేషన్‌ ట్వీట్(tweet) జత చేసింది.దీంతో పోలీసులు డాక్టరుపై జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. గాయపడిన కుక్కను డాగ్ హోమ్ ఫౌండేషన్‌ తమ కుక్కల సహాయ కేంద్రానికి తీసుకెళ్లింది.  




Updated Date - 2022-09-19T15:32:09+05:30 IST