కుక్క నోట్లో ఊపిరి ఊది ప్రాణం నిలబెట్టాడు.. వైరల్ వీడియో

ABN , First Publish Date - 2022-01-31T05:26:31+05:30 IST

సీపిఆర్.. అనేక సందర్భాల్లో మనిషి ప్రాణాలు నిలబెట్టే ఓ వైద్య ప్రక్రియ. అకస్మాత్తుగా ఊపరి తీసుకోవడం ఆగిపోయిన వాళ్లలో నేరు నోటి ద్వారా ఊపిరి ఊది, గుండెలపై గట్టిగా కొడ్డం ద్వారా వారిలో మళ్లీ హృదయ స్పందనలు మొదలయ్యేలా చేసేదే సీపీఆర్. అయితే అమెరికాలోని ఓ వ్యక్తి ఏకంగా కుక్కకు సీపీఆర్ చేశాడు.

కుక్క నోట్లో ఊపిరి ఊది ప్రాణం నిలబెట్టాడు.. వైరల్ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: సీపిఆర్(కార్డియో పల్మొనరీ రిససిిిటేషన్).. అనేక సందర్భాల్లో మనిషుల ప్రాణాలు నిలబెట్టే  వైద్య ప్రక్రియ. అకస్మాత్తుగా గుండె కొట్టుకోవడం ఆగిపోయిన వాళ్లకు నోటి ద్వారా నేరుగా ఊపిరి ఊది ఆ తరువాత గుండెలపై గట్టిగా కొడ్డం ద్వారా వారిలో మళ్లీ హృదయ స్పందనలు మొదలయ్యేలా చేసేదే సీపీఆర్. సాధారణంగా మనుషుల ప్రాణాలు కాపాడేందుకు వాడే ఈ ప్రక్రియతో ఓ వ్యక్తి కుక్కను ప్రాణాపాయం నుంచి తప్పించాడు. ఓ కుక్క అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోవడం గమనించిన ఆ వ్యక్తి కుక్క నోటికి నేరుగా తన నోటితో ఊపిరి అందించి.. దాని ఛాతిపై చరిచి కోలుకునేలా చేశాడు. అతడి ప్రయత్నాలు ఫలించడంతో అచేతనంగా పడి ఉన్న ఓ కుక్క ఎంత అకస్మాత్తుగా పడిపోయిందో అదే విధంగా ఉన్నఫళాణ లేచి నిలబడింది. అతడి ప్రయాస తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మానవత్వాన్ని చాటిచెబుతున్న ఈ అరుదైన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. 



Updated Date - 2022-01-31T05:26:31+05:30 IST