Viral Video: ఇంటి ముందు కూర్చుని ఏడుస్తున్న యువతి.. సైలెంట్‌గా వచ్చి ఆమెపై టాయ్‌లెట్ పోసిన శునకం..

ABN , First Publish Date - 2022-05-19T23:34:03+05:30 IST

ఏమైందో ఏమో తెలియదు కానీ ఓ యువతి తన ఇంటి ముందు కూర్చుని ఏడుస్తూ ఉంది. ఇంతలో అక్కడకు ఓ శునకం వచ్చింది. ఆమె బాధను ఏ మాత్రం పట్టించుకోని ఆ శునకం తన పని తాను చేసుకుని వెళ్లిపో

Viral Video: ఇంటి ముందు కూర్చుని ఏడుస్తున్న యువతి.. సైలెంట్‌గా వచ్చి ఆమెపై టాయ్‌లెట్ పోసిన శునకం..

ఇంటర్నెట్ డెస్క్: ఏమైందో ఏమో తెలియదు కానీ ఓ యువతి తన ఇంటి ముందు కూర్చుని ఏడుస్తూ ఉంది. ఇంతలో అక్కడకు ఓ శునకం వచ్చింది. ఆమె బాధను ఏ మాత్రం పట్టించుకోని ఆ శునకం తన పని తాను చేసుకుని వెళ్లిపోయింది. యువతిని చూసి ఏదైనా విగ్రహం అనుకుందో లేక మరెమైనా అనుకుందో తెలియదు కానీ.. సైలెంట్‌గా వచ్చి సరిగ్గా యువతిపై టాయ్‌లెట్ చేసి అంతే నిశ్శబ్దంగా అక్కడ నుంచి వెళ్లిపోయింది. అయితే వెనకాల ఏదో తడిగా అనిపించడంతో వెనక్కి తిరిగి చూసి సదరు యువతి షాకైంది. అనంతరం చేసేదేమీ లేక.. ఆ శునకాన్నీ ఏమీ అనలేక అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. 




Updated Date - 2022-05-19T23:34:03+05:30 IST