Advertisement

ఆస్పత్రి బెడ్‌పై రిలాక్స్ అవుతున్న కుక్క.. వీడియో వైరలవడంతో..

Jan 16 2021 @ 17:33PM

లక్నో: ప్రస్తుత కరోనా కాలంలో అది కూడా ప్రభుత్వం, ప్రైవేటు అనే తేడా లేకుండా ఆస్పత్రుల్లో బెడ్లు ఎంత ముఖ్యమో తెలిసిందే. ఇలాంటి సమయంలో ఓ శునకం ఆస్పత్రి బెడ్డుపై విశ్రాంతి తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ లో పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రి ఉంది. ఈ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఓ బెడ్డుపై ఈ శునకం విశ్రాంతి తీసుకుంటోంది. ఇక్కడి మహిళల సర్జికల్ వార్డులోని 28వ నెంబర్ బెడ్డుపై శునకం పడుకొని ఉన్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇలా ప్రత్యక్షమైన క్షణాల్లోనే ఇది వైరలైపోయింది. దీన్ని చూసిన చాలామంది నెటిజన్లు.. ఇది ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమేనని విమర్శలు చేస్తున్నారు. గమనించిన జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. 

 
Follow Us on:
Advertisement