Viral Video: తలపై నీళ్ల గ్లాసు పెట్టుకుని ఈ కుక్క చేసిన విన్యాసం చూస్తే.. అదరహో.. అనాల్సిందే..

ABN , First Publish Date - 2022-07-07T02:43:06+05:30 IST

కొన్ని జంతువులు చేసే పనులు చూస్తే.. ఒక్కోసారి విచిత్రంగా అనిపిస్తుంది. అరే! మనుషుల కంటే జంతువులే బాగా చేస్తున్నాయే.. అని అనిపిస్తుంది. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో..

Viral Video: తలపై నీళ్ల గ్లాసు పెట్టుకుని ఈ కుక్క చేసిన విన్యాసం చూస్తే.. అదరహో.. అనాల్సిందే..

కొన్ని జంతువులు చేసే పనులు చూస్తే.. ఒక్కోసారి విచిత్రంగా అనిపిస్తుంది. అరే! మనుషుల కంటే జంతువులే బాగా చేస్తున్నాయే.. అని అనిపిస్తుంది. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. చింపాజీలు, కుక్కలు తదితర జంతువులు మనుషులను అనుకరించడం గతంలో చాలా చూశాం. కొన్ని కుక్కలకు చాలా తెలివి ఉంటుంది. అలాంటి కుక్కలు చేసే పనులు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం ఓ కుక్క చేసిన విన్యాసానికి సంబంధించిన వీడియో ఒకటి.. తెగ వైరల్ అవుతోంది. తలపై నీళ్ల గ్లాసు పెట్టుకుని.. అది చేసే క్యాట్ వాక్ చూసి నెటిజన్లు వాహ్వా.. ఈ కుక్క టాలెంటే వేరు.. అని కామెంట్లు పెడుతున్నారు. 


ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ కుక్క శిక్షణ తీసుకుని ఇలా చేసిందో.. లేక స్వతహాగా చేసిందో తెలీదు గానీ.. అది చేసిన విన్యాసం మాత్రం అదరహో! అనేలా ఉంది. తలపై నీళ్ల గ్లాసు పెట్టుకుని ఏకాగ్రతతో నడవడాన్ని వీడియోలో చూడొచ్చు. గ్లాసు కింద పడకుండా.. జాగ్రత్తలు తీసుకుంటూనే, మరోవైపు చకచకా క్యాట్ వాక్ చేస్తుంది. కుక్క ఏకాగ్రత చూస్తే.. ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కుక్క చేసిన విన్యాసాన్ని.. దాని యజమాని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ కుక్క బాగా ప్రాక్టీస్ చేసినట్లుందే.. అంటూ నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

పులి బోనులో ఉంది కదా అని.. చక్కిలిగింతలు పెట్టాడు.. ఇంతలో అనుకోని ఘటన.. అయితే టైం బాగుండడంతో..





Updated Date - 2022-07-07T02:43:06+05:30 IST