Shocking Video: పెంపుడు శునకాన్ని ఇంట్లోనే ఉంచి బయట తాళం వేసి వెళ్లి పోతే.. ఎంత ఘోరం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-06-18T20:09:48+05:30 IST

పెంపుడు కుక్కను ఇంట్లోనే వదిలేసి యజమానులు బయటకు వెళ్లారు.. ఇంట్లో ఒంటరిగా ఉన్న కుక్క ఆహారం కోసం కిచెన్‌లోకి వెళ్లింది..

Shocking Video: పెంపుడు శునకాన్ని ఇంట్లోనే ఉంచి బయట తాళం వేసి వెళ్లి పోతే.. ఎంత ఘోరం జరిగిందంటే..

పెంపుడు కుక్కను ఇంట్లోనే వదిలేసి యజమానులు బయటకు వెళ్లారు.. ఇంట్లో ఒంటరిగా ఉన్న కుక్క ఆహారం కోసం కిచెన్‌లోకి వెళ్లింది.. ఎక్కడైనా తనకు ఆహారం దొరుకుతుందేమోనని అన్వేషణ సాగించింది.. ఆ క్రమంలో అనుకోకుండా స్టవ్ బటన్ ఆన్ చేసింది.. దీంతో మంటలు చెలరేగి ఇల్లంతా కాలిపోయింది.. అయితే ఆహారం లేకపోవడంతో కుక్క ముందుగానే బయటకు వెళ్లిపోవడంతో బతికిపోయింది.. ఆ ఘటన మొత్తం ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. 


అమెరికాలోని మిసోరిలో పార్క్‌విల్లేలోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఇంట్లో పెంపుడు జంతువులను ఒంటరిగా వదిలేసి వెళ్లకూడదని పేర్కొంటూ సదరన్ ప్లాట్ ఫైర్ ప్రొటక్షన్ టీమ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంటి నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో ఫైర్ ప్రొటక్షన్ టీమ్ వెంటనే అక్కడకు వెళ్లి లోపల ఉన్న శునకాన్ని కాపాడింది. ఇంటి యజమానులకు సమాచారం ఇచ్చింది. 

Updated Date - 2022-06-18T20:09:48+05:30 IST