కుక్కల స్వైర విహారం

ABN , First Publish Date - 2020-12-03T05:10:01+05:30 IST

గ్రామాల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. బుధవారం వేర్వేరు గ్రా మాల్లో కుక్కల దాడిలో 20 మంది గాయపడ్డారు.

కుక్కల స్వైర విహారం
కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారి

- వేర్వేరు చోట్ల 20 మందిపై దాడి 

చందుర్తి, డిసెంబరు 2:  గ్రామాల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. బుధవారం వేర్వేరు గ్రా మాల్లో కుక్కల దాడిలో 20 మంది గాయపడ్డారు.  చందుర్తి మండలంలోని మూడపల్లి, మర్రిగడ్డ, బం డపల్లి, జోగాపూర్‌ గ్రామాల్లో 13 మందిపై దాడి చేశాయి. దాడిలో వృద్ధులు, చిన్నారులతోపాటు ఒక దూడకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మూడపల్లిలో పెంట వర్షిత్‌, చిలుక రిషికుమార్‌, కట్కూరి ఇస్రాయేలు, అల్లే ఈశ్వర్‌, సిరిగిరి భూమయ్య, రమేష్‌ మర్రిగడ్డలో ఎల్లవ్వ, రాజు, బండపల్లిలో పద్మ, జోగాపూర్‌లో జ్యోతి, రుద్రంగిలో మధు, గంగారెడ్డి, హర్షిత్‌  కుక్కల దాడిలో గాయపడ్డారు. బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు మండల వైద్యాధికారి మసూద్‌ తెలిపారు. 


పిచ్చికుక్క దాడిలో ఏడుగురికి గాయాలు

ఇల్లంతకుంట: మండలకేంద్రంలో బుధవారం పిచ్చికుక్క దాడిలో ఏడుగురు గాయపడ్డారు. వివేకానంద చౌరస్తా సమీపంలోకి వచ్చిన పిచ్చికుక్క నారాయణ, కనుకయ్య, లక్ష్మి, రాజు, నారాయణ, రాకేష్‌, లక్ష్మిపై దాడి చేసి గాయపర్చింది. దీంతో స్థానికులు పిచ్చికుక్కను బస్టాండ్‌ సమీపంలో చంపివేశారు. కుక్కల బెడద ఎక్కువైందని, పాలకవర్గం స్పందించాలని గ్రామస్థులు కోరారు. 

Updated Date - 2020-12-03T05:10:01+05:30 IST