పిచ్చికుక్కలతో ప్రజలు బెంబేలు

ABN , First Publish Date - 2021-03-01T05:34:32+05:30 IST

పిచ్చికుక్కలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

పిచ్చికుక్కలతో ప్రజలు బెంబేలు

  పలువురికి తీవ్ర గాయాలు

 వాక్సిన్‌ అందుబాటులో లేని వైనం

పర్చూరు, ఫిబ్రవరి 28: పిచ్చికుక్కలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గడిచిన రెండు రోజుల్లో  పిచ్చి కుక్కల దాడిలో పదుల సంఖ్యలో గాయపడి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఒక్క రోజులోనే పర్చూరు పరిసర ప్రాంతాల్లో ఏడుగురు వీటి బారిన పడ్డారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు రాబీస్‌ టీకా కోసం పరుగులు పెడుతున్నారు. అక్కడ ఈ ఇంజెక్షన్‌లు లేకపోవడంతో గత్యంతరం లేక ఒంగోలు రిమ్స్‌కు వెళుతున్నారు. పర్చూరు మండల పరిధిలోని ఉప్పుటూరు, నాగులపాలెం, నూతలపాడు, పెద్దివారిపాలెం తదితర గ్రామాల్లో శున కాల బెడత తీవ్రంగా ఉంది. విచక్షణారహితంగా దాడిచేస్తూ గాయాలు చేస్తున్నాయి. ఎన్నిమార్లు పంచాయతీ అధికారుల కు తమ గోడు వెల్లబుచ్చుకున్నా పట్టించుకొనే నా థుడే కరువయ్యారని ప్రజలు ఆవేదన చెందుతు న్నారు. గ్రామాల్లో ఎక్కడ చూచినా వందల సంఖ్యలో శునకాలు సంచరిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. పర్చూరులో పరిస్థితి మరింత జటిలంగా మారింది. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు తగు చర్యలు తీ సుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

పర్చూరు ప్రభుత్వ వైద్యశాలలో రాబీస్‌ వాక్సిన్‌ అందుబాటులో లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పర్చూరుతోపాటు చుట్టుపక్కల అనేక గ్రామాలకు ఇది కేంద్రంగా ఉంది. ఇప్పటికైనా వెద్యా ధికారులు స్పందించి వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-03-01T05:34:32+05:30 IST