డాలర్‌ శేషాద్రికి రేపు తిరుపతిలో అంత్యక్రియలు

Nov 29 2021 @ 21:08PM

తిరుపతి: డాలర్‌ శేషాద్రి కి నేడు తిరుపతిలో అంత్యక్రియలు జరగనున్నాయి. వైజాగ్‌ నుంచి ఆయన పార్థివదేహం సోమవారం అర్థరాత్రి తర్వాత తిరుపతికి చేరుకోనుంది. మంగళవారం ఉదయం ప్రజల సందర్శనార్థం తిరుపతిలోని సిరిగిరి అపార్ట్‌మెంట్‌లో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2-3గంటల మధ్య తిరుపతి గోవిందధామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టుప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ డాలర్‌ శేషాద్రికి నివాళులర్పించేందుకు తిరుపతికి రానున్నారు. శేషాద్రి నివాసానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి, మధ్యాహ్నం 2గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

Follow Us on:

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.