గృహ కార్మికుల నియామకాలపై ఖతార్ కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2021-04-17T14:36:38+05:30 IST

గల్ఫ్ దేశం ఖతార్ గృహ కార్మికుల నియామకాల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

గృహ కార్మికుల నియామకాలపై ఖతార్ కీలక నిర్ణయం!

ఖతార్‌లో భారత్ సహా ఏడు దేశాల గృహ కార్మికులకు అనుమతి 

దోహా: గల్ఫ్ దేశం ఖతార్ గృహ కార్మికుల నియామకాల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ఖతార్ గత కొన్ని నెలలుగా విదేశీ గృహ కార్మికుల నియామకాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా భారత్ సహా 7 దేశాల నుండి గృహ కార్మికుల నియామకానికి ఖతార్‌ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఖతారీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ కీలక ప్రకటన చేసింది. ఫిలిప్పీన్స్, భారత్, శ్రీలంక, కెన్యా, ఇథియోపియా, బంగ్లాదేశ్, ఎరిట్రియా దేశాల నుంచి డొమెస్టిక్ వర్కర్లను నియమించుకోవచ్చని ప్రకటించింది. ఇక కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో గతేడాది నవంబర్‌లో విదేశీ కార్మికుల నియామకాలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశంలోని కొవిడ్-19 సంక్షోభంపై ఏర్పాటైన కమిటీ సూచన మేరకు 'ట్రావెల్ అండ్ రిటర్న్' నిబంధన ప్రకారం కార్మిక శాఖ కొత్త లేబర్ ఎంట్రీ పాలసీని తీసుకొచ్చింది. కాగా, కరోనా కట్టడి కోసం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కేవలం 50 శాతం ఉద్యోగులు మాత్రమే హాజరు కావాలనే నిబంధనను కార్మిక శాఖ అమలు చేస్తోంది. హెల్త్‌ సెక్టార్, సెక్యూరిటీ, మిలటరీ తదితర వాటికి దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. దేశవ్యాప్తంగా సినిమా హాళ్లు, బార్బర్ షాప్స్, బ్యూటీ సెలూన్స్, మ్యూజియంలు, లైబ్రరీలు పూర్తిగా మూతపడ్డాయి.      

Updated Date - 2021-04-17T14:36:38+05:30 IST