అనూహ్యంగా రాత్రికి రాత్రే నా ఓట్లు అదృశ్యమయ్యాయి: ట్రంప్

ABN , First Publish Date - 2020-12-06T17:03:20+05:30 IST

నబంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే.

అనూహ్యంగా రాత్రికి రాత్రే నా ఓట్లు అదృశ్యమయ్యాయి: ట్రంప్

వాషింగ్టన్‌: నబంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ తన ఓటమిని అంగీకరించకుండా సాకులు వెతికే పనిలో పడ్డారు. ఇప్పటికే ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, డెమొక్రట్లు మోసం చేశారని ఆరోపిస్తున్న ట్రంప్.. తాజాగా మరో కొత్త పాట అందుకున్నారు. ఎన్నికలు జరిగిన రాత్రికి రాత్రే తన ఓట్లు అనూహ్యంగా అదృశ్యమయ్యాయని చెబుతున్నారు. ఇలా అదృశ్యమైన అనేక ఓట్లను తన బృందం గుర్తించినట్లు మీడియాకి తెలిపారు. రాత్రి 10 గంటలకు తాను విజయం సాధించడం ఖాయమని, అత్యంత సులువుగా తాను గెలవబోతున్నట్లు అంతా చెప్పారు. 


కానీ, హఠాత్తుగా తన ఓట్లు అదృశ్యం కావడం ప్రారంభమైందన్నారు. ఇది ముమ్మాటికి మోసమేనని ట్రంప్ ఆరోపించారు. ఇలా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కోర్టు మెట్లెక్కిన ట్రంప్‌కు చుక్కెదురైన విషయం తెలిసిందే. తన ఆరోపణలను నిరూపించే ఆధారాలు చూపించలేక న్యాయస్థానంలో ట్రంప్ బోల్తా పడ్డారు. అధికారులు ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, న్యాయంగానే జరిగాయని చెబుతున్న ట్రంప్ వినడం లేదు. ఇప్పటికీ తన ఓటమిని అంగీకరించకుండా సాకులు వెతికే పనిలోనే ఉన్నారు. 


Updated Date - 2020-12-06T17:03:20+05:30 IST