భారీ ఉద్దీపన ప్యాకేజీని తిరస్కరించిన ట్రంప్ !

ABN , First Publish Date - 2020-12-23T22:18:25+05:30 IST

కరోనా దెబ్బతో అల్లకల్లోలమైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికన్ ఉభయ సభలు 900 బిలియన్ల ఉద్దీపన ప్యాకేజీని మంగళవారం ఆమోదించిన విషయం తెలిసిందే.

భారీ ఉద్దీపన ప్యాకేజీని తిరస్కరించిన ట్రంప్ !

వాషింగ్టన్: కరోనా దెబ్బతో అల్లకల్లోలమైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికన్ ఉభయ సభలు 900 బిలియన్ల ఉద్దీపన ప్యాకేజీని మంగళవారం ఆమోదించిన విషయం తెలిసిందే. అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం వైట్‌హౌస్‌కు పంపించాయి. కానీ, ట్రంప్ ఈ ఉద్దీపన ప్యాకేజీని తిరస్కరించి చట్ట సభ్యులకు షాక్ ఇచ్చారు. ఈ బిల్‌పై తాను సంతకం చేయబోనని తేల్చి చెప్పడంతో పాటు దేశ పరువు తీసే బిల్లుకు చట్ట సభ్యులు ఆమోదించడం ఏంటని చూరకలంటించారు. కాగా, ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే కరోనా వ్యాక్సిన్‌కు కావాల్సిన నిధులతో పాటు మహమ్మారి ప్రభావంతో అస్తవ్యస్తంగా మారిన అమెరికాలోని వివిధ సంస్థలు, పౌరులకు ఈ ప్యాకేజీ నుంచి వివిధ రూపాల్లో ఆర్థిక సహాయం అందించాలని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు భావించారు. ముఖ్యంగా కరోనా ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయినవారికి వారానికి సుమారు 300 డాలర్లు(రూ.22వేలు) అందిస్తామని కూడా పేర్కొన్నారు. కానీ, ట్రంప్ ఈ బిల్లును తిరస్కరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పైగా బిల్లును ఎందుకు రిజెక్ట్ చేశారో కూడా ట్రంప్ స్పష్టంగా చెప్పకపోవడం గమనార్హం.  



Updated Date - 2020-12-23T22:18:25+05:30 IST