Trump Toupee: ట్రంప్ కొత్త హెయిల్ స్టైల్‌ చూసి నెటిజన్ల గగ్గోలు..!

Published: Mon, 08 Aug 2022 19:51:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Trump Toupee: ట్రంప్ కొత్త హెయిల్ స్టైల్‌ చూసి నెటిజన్ల గగ్గోలు..!

ఎన్నారై డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) హెయిర్ స్టైల్.. అమెరికన్లకే ఓ పజిల్! ట్రంప్ హెయిర్‌స్టైల్ కోసం తల ఎలా దువ్వుకోవాలో చెప్పే సవివరమైన వార్తాకథనాలు కూడా అప్పట్లో వెలువడ్డాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజలు ఎక్కువగా చర్చించిన అంశాల్లో ఆయన హెయిర్‌స్టైల్ కూడా ఒకటి.  అంతటి చరిత్ర ఉన్న హెయిర్‌స్టైల్‌కు ట్రంప్ తాజాగా ముగింపు పలికారు. ఓ కొత్త హెయిర్‌స్టైల్‌తో ముందుకు వచ్చారు. ఇటీవల విస్కాన్సిన్ రాష్ట్రంలో జరిగిన సేవ్ అమెరికా ర్యాలీలో కొత్త స్టైల్‌లో ట్రంప్ కనిపించారు. 


దీంతో.. సోషల్ మీడియాలో మళ్లీ గగ్గోలు రేగింది.  వివిధ రకాల మీమ్స్, కామెంట్స్‌తో నెటిజన్లు తెగ హడావుడి సృష్టిస్తున్నారు. Trump toupee హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ట్రంప్ చేతిలో డబ్బుల్లేక ఇలాంటి స్టైల్‌ను ఎంచుకున్నారేమో అంటూ కొందరు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ట్రంప్ మునుపటి హెయిర్‌స్టైల్‌, తాజా స్టైల్‌ తాలూకు ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ కొత్తదే బాగుందంటూ తీర్పు ఇచ్చేశారు. తదుపరి హెయిర్ స్టైల్ ఎలా ఉండబోతోందో ఊహిస్తూ మరికొందరు కొన్ని ఫన్నీ ఫొటోలను షేర్ చేశారు. 


ఇక గతంలో అధికారం పంచుకున్న ట్రంప్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థులుగా మారిన విషయం తెలిసిందే. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మళ్లీ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వారిద్దరూ అరిజోనా రాష్ట్రంలో పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. త్వరలో జరగనున్న రిపబ్లిక్ ప్రైమరీ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. 




Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

అమెరికా నగరాల్లోLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.