Advertisement

రామాలయ నిర్మాణానికి విరాళం ఇవ్వాలి

Jan 21 2021 @ 23:47PM
ఆదిలాబాద్‌లో విరాళం సేకరిస్తున్న సభ్యులు

ఆదిలాబాద్‌టౌన్‌, జనవరి 21: భవ్య రామ మందిర నిర్మాణానికి విరివిగా విరాళాలు అందించి హిందువులు భాగస్వాములు కావాలని శ్రీరామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు కుర్ర దుర్గారెడ్డి కోరారు. జిల్లాలో జన సంఘ్‌ వ్యవస్థాపకులు గందె యాదవ్‌కుమార్‌ కుమారులు బీజేపీ సీనియర్‌ నాయకులు గందె విజయ్‌కుమార్‌, కృష్ణకుమార్‌, మోహన్‌ కుమార్‌లు తన తల్లి వసుబాయి చేతుల మీదుగా విరాళాన్ని అందించారు. గురువారం అశోక్‌రోడ్డులోని వారి నివాసంలో ట్రస్టు సభ్యులకు 51వేల రూపాయల చెక్కును అందించారు. నిధి సమర్పణ అభియాన్‌ సమర్పణ కార్యక్రమ విశిష్టతను ట్రస్టు సభ్యులు కుర్ర దుర్గారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సల్ల విజయ్‌బాబు, ప్రతాప్‌రెడ్డి తదితరులున్నారు.

ఆదిలాబాద్‌అర్బన్‌: రామజన్మభూమి తీర్థక్షేత్ర నిధి సమర్పణలో భాగంగా స్థానిక ఓల్డ్‌ హౌజింగ్‌ బోర్డు కాలనీ వార్డు నెంబర్‌ 37లో నిధి సమర్పణ అభియాన్‌ ప్రారంభించారు. ఇందులో స్థానిక కౌన్సిలర్‌ అంబకంటి అశోక్‌, ఈ జాగరణకు సంబంధించిన సంయోజక్‌ రుక్మారెడ్డి, వేణుమాధవ్‌, డిపాజిటర్‌ బద్దం పురుషోత్తంరెడ్డి, నిధి కలెక్షన్‌ నవీన్‌, మహిళ జాగరణ సభ్యులు దరహాస, శోభ, ఆలయ పూజారులు, రిమ్స్‌ వైద్యులు డాక్టర్‌ తిరుమల్‌రెడ్డి, అక్షయ్‌ పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement