మహారుద్ర పీఠానికి విరాళం

Sep 28 2021 @ 00:33AM
పీఠం నమోనాతో బ్రహ్మారెడ్డి దంపతులు

పీసీపల్లి, సెప్టెంబరు 27: మండలంలోని పెద్ద ఇర్లపాడు గ్రామంలో త్రినేత్ర పౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మహారుద్ర పీఠానికి నిజామాబాద్‌ పీబీఆర్‌ బ్రిక్స్‌ యజమాని పోలు బ్రహ్మరెడ్డి, రమా దంపతులు రూ. 1,01,111లు విరాళాన్ని ప్రకటించారు. ఈ విరాళాన్ని గోపుర నిర్మాణానికి ఖర్చు చేయాలని త్రినేత్ర పౌండేషన్‌ అఽధినేత పలుకూరు సుబ్బారావును కోరుతూ బ్రహ్మరెడ్డి నగదు అందజేశారు. అనంతరం విరాళం అందజేసిన బ్రహ్మరెడ్డి దంపతులను సన్మానించి మహారుద్రపీఠ నమూనాను అందజేశారు. 

ఆక్స్‌ఫర్డ్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 

కందుకూరు : గ్రామదేవత అంకమ్మతల్లి ఆలయ పునర్నిర్మాణం కోసం, మచిలీపట్నం సమీపంలో నిర్మిస్తున్న బాబా 108 అడుగుల స్థూపం కోసం స్థానిక ఆక్స్‌ఫర్డ్‌ విద్యాసంస్థల యాజమాన్యం లక్ష రూపాయలు విరాళంగా అందజేసింది. సోమవారం ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి సమక్షంలో ఈ మొత్తాన్ని కమిటీ పెద్దలకు అందజేశారు. కార్యక్రమంలో ఆక్స్‌ఫర్డ్‌ విద్యాసంస్థల ఛైర్మన్‌ ఉన్నం భాస్కరరావు, కరస్పాండెంట్‌ బండి వెంకటేశ్వర్లు, డైరక్టర్లు బాలభాస్కర్‌, బెజవాడ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.