కరోనా రోగులకు దాతల బాసట

ABN , First Publish Date - 2021-05-10T05:30:00+05:30 IST

పలాస ప్రభుత్వసుపత్రి కరోనా వార్డులో చికిత్స పొందుతున్న బాధితులకు గ్రీన్‌ఆర్మీ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆసరాగా నిలిచారు. ఈ మేరకు వారికి సోమ వారం భోజన సౌకర్యం కల్పించారు.

కరోనా రోగులకు దాతల బాసట
ఆహార పొట్లాలను వైద్యాధికారులకు అందజేస్తున్న గ్రీన్‌ఆర్మీ సభ్యులు

గ్రీన్‌ఆర్మీ ఆధ్వర్యంలో భోజన సౌకర్యం

పలాస: పలాస ప్రభుత్వసుపత్రి కరోనా వార్డులో చికిత్స పొందుతున్న బాధితులకు గ్రీన్‌ఆర్మీ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆసరాగా నిలిచారు. ఈ మేరకు వారికి సోమ వారం భోజన సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు బి.గోపాల్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలోని కొవిడ్‌ కేంద్రంలో భోజనాల కోసం రోగులు, వారి బంధు వులు ఇబ్బందిపడుతుండడంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కొవిడ్‌ నిబంధనలు అనుసరించి భోజనం ప్యాకెట్లను వైద్యాధికారులు గౌతమ్‌,  పవన్‌, సునీల్‌, క్రాంతి లకు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు బి.తిరు మలరావు, మధు బాబు, ఓంకార్‌, చిట్టిబాబు, కిశోర్‌పాత్రో, లక్ష్మీనారాయణరెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

వాటర్‌ ప్యాకెట్లు, స్నాక్స్‌...

రాజాం రూరల్‌: రాజాం సామాజిక ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న బాధితులకు సాయమందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. సోమవారం సంపత్‌ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌ యజమాని గెళ్ల శ్రీనివాస్‌ 360 లీటర్ల వాటర్‌ బాటిళ్లు, 100 కర్జూరం ప్యాకెట్లు అందించారు. అలాగే పట్టణానికి చెందిన వడ్డాది మోహన్‌ వాటర్‌ బాటిళ్లు 100, స్నేక్స్‌ అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ రాజాంశాఖ అధ్యక్షుడు కొత్తా సాయి ప్రశాంత్‌ కుమార్‌, పెంకి చైతన్య, భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆక్సిజన్‌ యంత్రం వితరణ

కొత్తూరు (హిరమండలం): కొవిడ్‌ బాధితులను ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు తారకరామ కిరాణా స్టోర్స్‌ యజమాని కోట్ని రమేష్‌ తన భార్య జ్ఞాపకార్థం రూ.56 వేలు విలువ చేసే ఆక్సిజన్‌ యంత్రాన్ని వితరణ చేశారు. దీనిని హెల్పింగ్‌ హ్యాండ్స్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వా హకుడు పి.శ్రీధర్‌కు సోమవారం అందజేశారు. సందర్భంగా శ్రీధర్‌ మాట్లాడుతూ మరింతమందికి సేవ చేసేందుకు  ‘స్పందించు- ఆక్సిజన్‌ అందించు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మండలంలో ఆక్సిజన్‌ కావాల్సిన వారు 9703111108 నెంబరులో సంప్రదించాలని కోరారు. 


Updated Date - 2021-05-10T05:30:00+05:30 IST