దాతల సేవలు అభినందనీయం : చైర్‌పర్సన

ABN , First Publish Date - 2021-04-18T06:24:43+05:30 IST

వేసవికాలంలో ఉచితంగా మినిరల్‌ వాటర్‌, చలివేంద్రాలు ఏర్పాటు చే యడం, అభినందనీయమని మునిసిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ అన్నా రు.

దాతల సేవలు అభినందనీయం : చైర్‌పర్సన
చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న చైర్‌పర్సన ఇంద్రజ

 హిందూపురం టౌన, ఏప్రిల్‌ 17: వేసవికాలంలో ఉచితంగా మినిరల్‌ వాటర్‌, చలివేంద్రాలు ఏర్పాటు చే యడం, అభినందనీయమని మునిసిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ అన్నా రు. శనివారం యోగి నారాయణ సేవా సమి తి ఆధ్వర్యంలో మునిసిపల్‌ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. దీనిని మున్సిపల్‌ చైర్‌పర్సన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యోగినారాయణసేవా సమితి నాయకులు రవీశంకర్‌, రామచంద్ర, మంజునాథ్‌, చలపతి, జగదీశ్వర్‌, అశోక్‌, నాగరాజు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-18T06:24:43+05:30 IST