అమ్మానాన్నలను కోల్పోయినా అండగా ఉన్నారు

ABN , First Publish Date - 2020-07-05T10:40:05+05:30 IST

మండలంలోని రామంచ గ్రామ పంచాయితి పరిదిలోని అంటుకలపల్లికి చెందిన కన్నం తరుణ్‌ అనే బాలుడికి 65 వేల రూపాయాల

అమ్మానాన్నలను కోల్పోయినా అండగా ఉన్నారు

బాలుడిని ఆదుకున్న దాతలు


చిగురుమామిడి, జూలై 4: మండలంలోని రామంచ గ్రామ పంచాయితి పరిదిలోని అంటుకలపల్లికి చెందిన కన్నం తరుణ్‌ అనే బాలుడికి 65 వేల రూపాయాల విరాళాలను ఎంపీపీ కొత్త వినీతశ్రీనివాస్‌రెడ్డి శనివారం  అందజేశారు. గ్రామానికి చెందిన కన్నం హన్మయ్య అనే పంపు ఆపరేటర్‌ గుండె పోటుతో మృతి చెందాడు. దీంతో ఆయన కుమారుడు తరుణ్‌ అనాథగా మారాడు. అతని దీనస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ‘ఆంధ్రజ్యోతి’ బ్యూరోచీఫ్‌ నగునూరి శేఖర్‌ తరుణ్‌కు ఐదు వేల రూపాయాలను అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.


తరుణ్‌కు  విద్యను అందించాలనే ఆలోచనతో బ్రిడ్జి స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీపాల్‌తో మాట్లాడంతో ఆయన స్పందించి పాఠశాల ప్రారంభం కాగానే చేర్చుకుంటామని  హామీ ఇచ్చారు.. ఇదే కథనాన్ని నగునూరి శేఖర్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయ్యడంతో దాతలు ముందుకు వచ్చి వారికి తోచిన విదాంగా ఆర్థిక సహాయం చేశారు.


ఈ సందర్భంగా ఎంపీపీ ఎంపీపీ కొత్త వినీతశ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తరుణ్‌ను ఆదుకోవడంలో ‘ఆంధ్రజ్యోతి’ కృషి అభినందనీయమన్నారు.  కార్యక్రమంలో సర్పంచ్‌ గుంటి మాదవి తిరుపతి, సింగిల్‌ విండో చైర్మన్‌ జంగ వెంకటరమాణారెడ్డి,  ఉపసర్పంచ్‌ రొంటల కిషన్‌రెడ్డి, బీఎస్పీ మండల అద్యక్షుడు బోయిని బాబు, సిద్దెంకి రాయమల్లు, అశోక్‌, చట్ల సమ్మయ్య, ఖాత మల్లయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-05T10:40:05+05:30 IST