చాణక్యనీతి: వీరితో వివాదం.. ప్రయోజనం శూన్యం!

ABN , First Publish Date - 2022-07-07T12:21:28+05:30 IST

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో...

చాణక్యనీతి: వీరితో వివాదం.. ప్రయోజనం శూన్యం!

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో కొందరి గురించి చెబుతూ వారితో ఎప్పుడూ వివాదం పెట్టుకోకూడదన్నారు. వారితో వివాదం పెట్టుకుంటే మీ సమయం వృథా అవుతుందని సూచించాడు. అలాగే వారితో సంబంధాలు చెడిపోతాయని తెలిపాడు. ఆచార్య తెలిపిన వివరాల ప్రకారం మీరు మూర్ఖుడితో వాదిస్తే, అది గేదె ముందు వీణ వాయించినట్లవుతుంది. మూర్ఖుడు మీ మాటలు అర్థం చేసుకోలేడు. అటువంటి పరిస్థితిలో మీరు మీ సమయాన్ని, శక్తిని వృథా చేసుకున్నవారవుతారు. 


ఆ తరువాత పశ్చాత్తాప పడాల్సివస్తుంది. అందుకే వారితో వాదించవద్దు. వారితో వాదనకు దిగితే పశ్చాత్తాపం తప్ప మరొకటి మిగలదు. మీ జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. మీకు వెలుగును చూపేది గురువు. అలాంటి గురువుతో ఎలాంటి వివాదాలు పెట్టుకోకపోవడమే మంచిది. మీరు వారితో వాదనకు దిగితే మీరు వారి గౌరవానికి భంగం కలిగించినవారవుతారు. మీకు కోపం తగ్గాక మీ దగ్గర పశ్చాత్తాపం తప్ప మరేమీ మిగలదు. మీ స్నేహితులకు మీ రహస్యాలు తెలిసివుంటాయి. వారితో వివాదం పెట్టుకుంటే  కష్టతరంగా మారుతుంది. మీ రహస్యాలు అందరిముందు వెల్లడవుతాయి.

Updated Date - 2022-07-07T12:21:28+05:30 IST