చదువుకు పేదరికం అడ్డు కావొద్దు

ABN , First Publish Date - 2022-07-07T05:53:50+05:30 IST

చదువుకు పేదరికం అడ్డు కావొద్దు

చదువుకు పేదరికం అడ్డు కావొద్దు
ఆమనగల్లు: విద్యార్థులను సన్మానిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి

కడ్తాల్‌/చేవెళ్ల/షాబాద్‌, జూలై 6: చదువుకు పేదరికం అడ్డుకావొద్దని జిల్లా ఎంపీటీసీల సంఘం గౌరవాధ్యక్షుడు, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతిలో 10జీపీఏ సాధించిన విద్యార్థులకు బుధవారం పాఠశాల ఆవరణలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమంలో జహంగీర్‌బాబా, వెంకటేశ్‌ , లక్ష్మయ్య, శంకర్‌, రాంచందర్‌ నాయక్‌, మల్లేశ్‌ గౌడ్‌, శ్రీను, మహేశ్‌, శివ, రాజేశ్‌, ఇమ్రాన్‌బాబా, శివ పాల్గొన్నారు. అదేవిధంగా చేవెళ్లలోని ఊరెళ్ల ప్రభుత్వ పాఠశాలలో మండల వైఎస్‌ ఎంపీపీ కర్నె శివప్రసాద్‌ ప్రతిభ కనబర్చిన పదో తరగతి విద్యార్థులను సర్పంచ్‌ జహంగీర్‌తో కలిసి సన్మానించారు. హెచ్‌ఎం గోపాల్‌, ఉపసర్పంచ్‌ విఠలయ్య, నర్సింలు, బాషయ్య, రాజు, అక్బర్‌, కృష్ణప్రసాద్‌, శ్రీశైలం, నర్మదా, చాముండేశ్వరి పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్‌లోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో మండల విద్యాధికారి శంకర్‌రాథోడ్‌ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు. హెచ్‌ఎంలు కృష్ణవేణి, నర్సింహులు, ఝాన్సీ, శ్రీనివాస్‌ ఉన్నారు. 

Updated Date - 2022-07-07T05:53:50+05:30 IST