కీవ్‌లో కమ్ముకున్న పొగ.. పౌరులకు హెచ్చరిక

ABN , First Publish Date - 2022-03-19T23:28:03+05:30 IST

రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండటంతో ఉక్రెయిన్ వాతావరణం దెబ్బతింటోంది. ముఖ్యంగా రాజధాని కీవ్‌పై రష్యా దాడి తీవ్రం కావడంతో అక్కడ వాయు కాలుష్యం భారీ స్థాయిలో పెరిగింది.

కీవ్‌లో కమ్ముకున్న పొగ.. పౌరులకు హెచ్చరిక

రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండటంతో ఉక్రెయిన్ వాతావరణం దెబ్బతింటోంది. ముఖ్యంగా రాజధాని కీవ్‌పై రష్యా దాడి తీవ్రం కావడంతో అక్కడ వాయు కాలుష్యం భారీ స్థాయిలో పెరిగింది. గాలిలో మొత్తం పొగ కమ్ముకుంది. వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో, పౌరులెవరూ ఇళ్లు దాటి బయటకు రాకూడదని ఉక్రెయిన్ ప్రభుత్వం సూచించింది. అలాగే, ఇండ్ల కిటికీలు, తలుపులు కూడా తెరవకూడదని చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఆరోగ్యకర వాయుకాలుష్య రేటును ఉక్రెయిన్ ఎప్పుడో దాటిపోయింది. సగటు వాయుకాలుష్య రేటుకంటే 27.8 రెట్లు ఎక్కువ కాలుష్యం ఉందని అక్కడి నివేదికలు చెబుతున్నాయి. దీంతో కీవ్ ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

Updated Date - 2022-03-19T23:28:03+05:30 IST