ప్ర‌భుత్వ విద్యని దూరం చేయొద్దు: జగన్‌కు నారా లోకేష్ లేఖ

ABN , First Publish Date - 2022-07-06T23:55:44+05:30 IST

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ లేఖ రాశారు. జాతీయ విద్యా విధానం, పాఠ‌శాల‌ల విలీనంతో పేద‌పిల్ల‌ల‌ని ప్ర‌భుత్వ విద్య దూరం చేయొద్ద‌ని లేఖలో పేర్కొన్నారు.

ప్ర‌భుత్వ విద్యని దూరం చేయొద్దు: జగన్‌కు నారా లోకేష్ లేఖ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ లేఖ రాశారు. జాతీయ విద్యా విధానం, పాఠ‌శాల‌ల విలీనంతో పేద‌పిల్ల‌ల‌ని ప్ర‌భుత్వ విద్య దూరం చేయొద్ద‌ని లేఖలో పేర్కొన్నారు.

ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోండి

‘‘ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ జీవో 117 వ‌ల్ల పాఠ‌శాల‌లు, ఉపాధ్యాయుల‌ హేతుబ‌ద్ధీక‌ర‌ణ‌తో నిరుపేద విద్యార్థుల‌కు ప్ర‌భుత్వ బ‌డులు ఇంకా దూరం అవుతున్నాయి. 2 కిలో మీటరు పరిధిలో 3,4,5 తరగతులను అప్పర్ ప్రైమరీ స్కూళ్ల‌లోను, హైస్కూల్స్‌లోను కలపటంవల్ల ఉపాధ్యాయ‌, విద్యార్థి నిష్ప‌త్తి పూర్తిగా పెరిగిపోయింది. జాతీయ విద్యావిధానం అమ‌లు చేయడం కంటే పాఠ‌శాల‌లు, ఉపాధ్యాయుల‌ని త‌గ్గించే ఆతృత మీలో క‌నిపిస్తోంది. ఈ  విద్యా విధానం వ‌ల్ల ప్ర‌స్తుతం ఉన్న 42 వేల పాఠ‌శాల‌లు భ‌విష్య‌త్తులో 11 వేల‌కి త‌గ్గిపోనున్నాయి. బ‌డులు త‌ర‌లించొద్దంటూ పిల్ల‌లు, వారి త‌ల్లిదండ్రులు రోడ్లు ఎక్క‌డం మీ దృష్టికి వ‌చ్చే ఉంటుంది. పేద‌పిల్ల‌ల‌కి  ప్ర‌భుత్వ విద్య‌ని దూరం చేసే ఈ నిరంకుశ నిర్ణ‌యాల‌ని వెన‌క్కి తీసుకోవాలి. ’’ అని  లోకేశ్  లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2022-07-06T23:55:44+05:30 IST