కరోనా అడ్డుకట్టకు ఫ్రెంచ్ వైద్యుల కీలక సూచన!

ABN , First Publish Date - 2021-01-25T02:44:07+05:30 IST

ప్రజారవాణా వ్యవస్థల ద్వారా ప్రయాణాం చేసే వారు తొటి ప్రయాణికులతో వీలైనంత తక్కువగా మాట్లాడాలని ఫ్రెంచ్ నిపుణులు తాజాగా ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇదో సులభమైన మార్గమని వారు చెబుతున్నారు. మాస్కులు ధరించడంతో పాటూ తొటి ప్రయాణికుతో సంభాషించకుండా ఉంటే వ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చు అని ఫ్రాన్స్‌కు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

కరోనా అడ్డుకట్టకు ఫ్రెంచ్ వైద్యుల కీలక సూచన!

పారిస్: ప్రజారవాణా వ్యవస్థల ద్వారా ప్రయాణాం చేసే వారు తొటి ప్రయాణికులతో వీలైనంత తక్కువగా మాట్లాడాలని ఫ్రెంచ్ వైద్యులు తాజాగా ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇదో సులభమైన మార్గమని వారు స్పష్టం చేశారు. మాస్కులు ధరించడంతో పాటూ తొటి ప్రయాణికుతో సంభాషించకుండా ఉంటే వ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చు అని ఫ్రాన్స్‌కు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ ఇటీవల కీలక ప్రకటన విడుదల చేసింది. అయితే..ఇది తప్పనిసరిగా పాటించాలని తాము ఆదేశించట్లేదని, ఓ సూచనను మాత్రమే ప్రజల ముందు ఉంచుతున్నామని కూడా పేర్కొంది. ప్రజారోగ్య సంబంధమైన విషయాలపై నేషనల్ ఎకాడమీ తరచూ పలు సూచనలు చేస్తుంటుంది. ఈ విషయాలపై ప్రభుత్వానికి తగు సలహాలు కూడా ఇస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో కేవలం సర్జికల్ మాస్కులు మాత్రమే వినియోగించాలంటూ ప్రభుత్వం ఇటీవల చేసిన ఓ సూచనను అకాడమీ తప్పుబట్టింది. ముందు జాగ్రత్త కోసం ఈ రకమైన చర్యలు తీసుకోవచ్చు గానీ..దీని వెనుక శాస్త్రపరమైన ఆధారాలేవీ లేవని కుండబద్దలు కొట్టింది 


Updated Date - 2021-01-25T02:44:07+05:30 IST