Hair Is Oily: జుట్టును పదే పదే తాకకండి..మీ జుట్టు జిడ్డుగా ఉండడానికి కారణాలివే....

ABN , First Publish Date - 2022-08-26T19:01:58+05:30 IST

జిడ్డు జుట్టు మరో ఇబ్బందికరమైన సమస్యలలో ఒకటి. ఈ జుట్టును స్టైల్ చేయడం కష్టంగా ఉంటుంది.

Hair Is Oily: జుట్టును పదే పదే తాకకండి..మీ జుట్టు జిడ్డుగా ఉండడానికి కారణాలివే....

అందమైన కేశాలు మనకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. పొడవైన జడ అందులో మల్లెలు.. తలుచుకుంటేనే అమ్మ తన జడలో మల్లెలు తురుముకునేది అనే విషయం గుర్తుకు వస్తుంది కదా.


ఇప్పటి మనకు అంత పెద్ద జడలు లేకపోయినా  ఉన్న ఆకాస్త జుట్టు దుమ్ము కాలుష్యంతో తలవెంట్రుకలు పొడిగా, పేలవంగా మారిపోవడం, పెద్దగా ఆకర్షణగా ఉండటం లేదు. వీటితో తరచుగా చుండ్రు సమస్య వేధిస్తుంది. దానికి తోడు జిడ్డు జుట్టు మరో ఇబ్బందికరమైన సమస్య. ఈ జుట్టును స్టైల్ చేయడం కష్టంగానే ఉంటుంది. తాకడానికి కూడా అసౌకర్యంగా అనిపిస్తుంది. 


1. తరచుగా తలస్నానం చేయకండి.

కొంత ఆశ్చర్యంగా అనిపించినా తరచుగా తలస్నానం చేయడం వల్ల జుట్టు జిడ్డుగా మారిపోతుంది. సేబాషియస్ గ్రంధిని ఎక్కువగా ప్రేరేపించడం అంటే అవసరం అయిన దానికంటే ఎక్కువగా తలస్నానం షాంపూని నురుగు వచ్చేలా మసాజ్ టెక్నిక్ వల్ల ఈ ప్రేరణ కలుగుతుంది. ఇలా కాకుండా షాంపూ లేకుండా జుట్టును కడుక్కోవడం, కండీషనర్ చేయడం మంచిది. 


2. సరిగా క్లీన్ చేయకపోవచ్చు..

 చాలాసేపు రుద్ది షాంపూ పోయేవరకూ తలను రుద్దుతూ ఉండాలి. ఇలా చేస్తేనే తల శుభ్రంగా ఉంటుంది. వెంట్రకల నుంచి షాంపూ పూర్తిగా పోతుంది.


3. వేడి నీటితో తలస్నానం మంచిది.

వేడి నీటితో తలస్నానం చేయడం మంచిఫలితాన్నే ఇస్తుంది. కాకపోతే మరీ వేడినీటిని తలమీద కుమ్మరించడం సరైన పనికాదు. ఎందుకంటే ఇది క్యూటికల్ నుంచి సహజ నూనెలు తీసివేస్తుంది. తలచర్మం వెంటనే జిడ్డుగా మారుతుంది. అదే చన్నీటితో తలస్నానం చేయడం జుట్టుకు మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది.   ఈ నీరు మంచి కండీషనర్ గా కూడా పనిచేస్తుంది. పైగా మెరుపును ఇస్తుంది. క్యూటికల్ ను మూసివేస్తుంది. తేమను లాక్ చేస్తుంది. 


4. over-style చేసారు..

జిడ్డు జుట్టుకు హెయిర్ ఆయిల్, ఆయిల్. పోమాడ్ వంటివి వాడటం వల్ల జుట్టు మరింత చెడిపోయే ప్రమాదం ఉంది. అవసరం అయితేనే తప్ప హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగించకపోవడం మంచిది.


5.జుట్టును తాకుతూ ఉంటారా?

మీ తలచర్మం సహజంగానే నూనెను ఉత్పత్తి చేస్తుంది. ఇక జుట్టును పదే పదే అదే పనిగా తాకడం వల్ల వేళ్ళలోని నూనె తలకు బదిలీ అవుతూ ఉంటుంది. స్టైల్ చేసిన తర్వాత జుట్టును తాకకుండా ఉండటం మంచిది.

Updated Date - 2022-08-26T19:01:58+05:30 IST