ఆందోళన చెందొద్దు!

ABN , First Publish Date - 2021-04-18T05:55:15+05:30 IST

జిల్లాలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోం ది. నిత్యం వందలా ది కేసులు నమోదు అవుతుండడంతో సాధారణ జ్వరాలు వచ్చిన వారు భయపడుతున్నారు. కరోనా అనే భయంతో పరీక్షలు చేయించుకుంటున్నారు. నెగిటివ్‌ వచ్చిన వారిని భయా లు వీడడంలేదు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి కొంతమంది లక్షణాలు ఉండడంలేవు. మరికొందరికీ లక్షణా లు ఎక్కువగా ఉంటున్నాయి. కరోనా వచ్చిన వారు ఆందోళన చెందకుండా వైద్యుల సూచనలతో మందులు వాడితే ఇబ్బందులు ఉండవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ లెవల్స్‌ పరిక్షించుకుంటూ పౌష్టిహారం తీసుకుంటే త్వరగా బయటపడవచ్చని చెబుతున్నారు. పాజిటి వ్‌ వచ్చిన వారు ఆందోళన చెందకుండా హోం ఐసోలేషన్‌లో ఉండి వైద్యు ల సూచనలు పాటిస్తే బయటపడుతారని సూచిస్తున్నారు.

ఆందోళన చెందొద్దు!

కరోనాకు మనోధైర్యమే రక్ష

సరైన మందులు, ఆహారం తీసుకుంటే నయం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోం ది. నిత్యం వందలా ది కేసులు నమోదు అవుతుండడంతో సాధారణ జ్వరాలు వచ్చిన వారు భయపడుతున్నారు. కరోనా అనే భయంతో పరీక్షలు చేయించుకుంటున్నారు. నెగిటివ్‌ వచ్చిన వారిని భయా లు వీడడంలేదు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి కొంతమంది లక్షణాలు ఉండడంలేవు. మరికొందరికీ లక్షణా లు ఎక్కువగా ఉంటున్నాయి. కరోనా వచ్చిన వారు ఆందోళన చెందకుండా వైద్యుల సూచనలతో మందులు వాడితే ఇబ్బందులు ఉండవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ లెవల్స్‌ పరిక్షించుకుంటూ పౌష్టిహారం తీసుకుంటే త్వరగా బయటపడవచ్చని చెబుతున్నారు. పాజిటి వ్‌ వచ్చిన వారు ఆందోళన చెందకుండా హోం ఐసోలేషన్‌లో ఉండి వైద్యు ల సూచనలు పాటిస్తే బయటపడుతారని సూచిస్తున్నారు. 

జిల్లాలో భారీగా కరోనా కేసులు..  

జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర ప్రభావం తో ఎక్కువగా వస్తున్నాయి. సెకండ్‌వేవ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో మొ దటి విడతకన్నా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వచ్చిన వారిలో 90 శాతానికి పైగా మందికి లక్షణాలు కనిపించడం లేదు. సాధార ణ జ్వరం, దగ్గు ఉండడంతో పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్‌ వస్తుంది. ఈ సెకండ్‌వేవ్‌లో ఇళ్లలో నుంచి బయటకు రానివారికి కూడా కేసులు వ స్తున్నాయి. ఇంటి నుంచి ఎవరో ఒకరు బయటకు వెళ్లిరావడం, స్వీయ ని యంత్రణ పాటించకపోవడంతో వ్యాప్తి ఎక్కువగా అవుతున్నట్లు ఐసీఎంఆ ర్‌ నిపుణుల బృందం అంచనా వేసింది.  కరోనా పాజిటివ్‌ వచ్చి వారు హోం ఐసొలేషన్‌ ఉండి అన్ని మందులు వాడితే పది రోజుల్లోనే తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, దమ్ము ఎక్కువై జ్వరం తగ్గకుండా ఉం టే వైద్యుల సూచనలు తీసుకుని ఆసుపత్రిలో చేరాలి. 

కరోనా వచ్చిన వారందరికీ వైద్య సేవలు..

డాక్టర్‌ బాలనరేంద్ర (జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి)

పాజిటివ్‌ వచ్చిన వారందరికీ సేవలు అందిస్తున్నాం. హోం ఐసోలేషన్‌ లో ఉన్నవారికి మందులను అందిస్తున్నాం. సీరియస్‌గా ఉన్నవారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ఆందోళన చెందవద్దు, 

సీరియస్‌గా అయ్యే వరకు చూడొద్దు.. 

డాక్టర్‌ ప్రతిమరాజ్‌, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌

కరోనా వచ్చిన వారు నిర్లక్ష్యంగా ఉండొద్దు. పాజిటివ్‌ వచ్చిన వారు వై ద్యుల సూచనలకు అనుగుణంగా మందులు తీసుకోవాలి. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి సీరియస్‌ అయిన తర్వాత ఎక్కువ మంది వస్తున్నారు. అప్పుడు చికిత్స అందించడం ఇబ్బంది అవుతుంది. లక్షణాలు కనిపించగానే మందులు వాడితే సమస్యరాదు. జాగ్రత్తలు తీసుకోవాలి.

చికిత్స పొందుతూ ఆరుగురు మృతి

పెద్దబజార్‌, ఏప్రిల్‌ 17: కొవిడ్‌చికిత్స పొందుతూ జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో శనివారం ఆరుగురు మృతిచెందినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.  బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌కు చెందిన వీరు కరోనా బారిన పడి నాలుగు రోజుల క్రితం జిల్లా ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. 

జర్నలిస్టు మృతి

నందిపేట: మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టు కరోనాతో మృతి చెందారు. కొంతకాలంగా హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికి త్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి మృతి చెందారు. శనివారం బజార్‌కొత్తూర్‌ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. ప్ర ముఖులు సానుభూతిని వ్యక్తం చేశారు. 

మరో 283 పాజిటివ్‌ కేసులు

పెద్దబజార్‌, ఏప్రిల్‌ 17: జిల్లాలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుంది. శనివారం జిల్లావ్యాప్తంగా 283 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా 6104 మందికి పరిక్షలు చేయగా, 283 మంది కి పాజిటివ్‌ రాగా 5821 మందికి నెగిటివ్‌ వచ్చింది. ఇప్పటి వరకు జి ల్లాలో 23065 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 2 లక్షల 50వేల 691 మందికి ర్యాట్‌, 5983 మందికి ఆర్టీపీసీఆర్‌ కరోనా పరీక్షలు చేశారు. 2 లక్షల 33 వేల 14 మందికి నెగిటివ్‌ రాగా 23 వేల 65 మందికి పాజిటివ్‌ వచ్చింది. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

Updated Date - 2021-04-18T05:55:15+05:30 IST