అక్రమ కొళాయిలపై ఇంటింటి సర్వే

ABN , First Publish Date - 2022-08-09T05:00:23+05:30 IST

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో కొన్నేళ్ళుగా పన్నుపరిధిలోకి రాని అక్రమ కొళాయిలను గుర్తించేందుకు మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు.

అక్రమ కొళాయిలపై ఇంటింటి సర్వే
అక్రమ కొళాయిల పై విచారిస్తున్న మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు

ప్రొద్దుటూరు అర్బన్‌ ఆగస్టు 8 : ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో కొన్నేళ్ళుగా పన్నుపరిధిలోకి రాని అక్రమ కొళాయిలను గుర్తించేందుకు మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. సోమవారం 1వ వార్డు బొల్లవరంలో ఇంటింటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పరిశీలించారు.ఈ సందర్భంగా ఈఈ సాయిక్రిష్ణ, డీఈ దస్తగిరి, ఏఈ దస్తగిరిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సర్వేలో దాదాపు 100కు పైగా అక్రమ కొళాయికనెక్షన్‌లను గుర్తించారు. దాదాపు   10 సంవత్సరాలుగా ఈ అక్రమ కొళాయిలు వినియోగిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.నాటి నుంచి నేటి వరకు నీటి పన్నును లెక్కకట్టిన మొత్తంతో పాటు కొత్త కొళాయి డిపాజిట్‌ మొత్తం చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. దీంతో ఒక్కొరికి 30 వేలనుంచి 50 వేల వరకు చెల్లించాల్సిరావడంతో బొల్లవరం వాసులు గగ్గోలు పెడుతున్నారు. అక్రమ కొళాయిలు వుండి నీటి పన్ను చెల్లించని వారు మున్సిపల్‌ కార్యాలయంలో సంప్రదించి డిపాజిట్‌ అపరాధ రుసుము చెల్లించి రెగ్యులర్‌ చేసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ రమణయ్య పిలుపు నిచ్చారు.

Updated Date - 2022-08-09T05:00:23+05:30 IST