వచ్చే నెలలో అలరించనున్న డోరెమాన్-2
ABN , First Publish Date - 2021-01-22T05:30:00+05:30 IST
డోరెమాన్, నోబిత... పిల్లలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేర్లు ఇవి. పిల్లలను అమితంగా ఆకట్టుకున్న ఈ కార్టూన్ షో లేటెస్ట్ మూవీ వచ్చే నెలలో విడుదల కాబోతోంది.
డోరెమాన్, నోబిత... పిల్లలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేర్లు ఇవి. పిల్లలను అమితంగా ఆకట్టుకున్న ఈ కార్టూన్ షో లేటెస్ట్ మూవీ వచ్చే నెలలో విడుదల కాబోతోంది. 2014లో వచ్చిన ‘స్టాండ్ బై మి డోరెమాన్’కు సీక్వెల్గా ఈ చిత్రం రాబోతోంది. ‘స్టాండ్ బై మి డోరెమాన్-2’ పేరుతో వస్తోన్న ఈ మూవీ తాజా పోస్టర్ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రస్తుతం అది ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంది. డోరెమాన్ గ్యాడ్జెట్లతో నోబిత చేసే హంగామా అందరికీ తెలిసిందే. నోబిత తన మనసులో ఉన్న మాటను షిజుకాకు చెప్పలేకపోతుంటాడు.
తాజాగా విడుదల చేసిన పోస్టర్లో నోబిత షిజుకను పెళ్లి చేసుకున్నట్టుగా వెడ్డింగ్ సెటప్ కనిపిస్తోంది. ఈ దృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నవంబర్లోనే జపాన్లో విడుదలైన ఈ మూవీ, వచ్చే నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.