అర్హులైన వారికి డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-01-22T03:41:22+05:30 IST

అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నారు.

అర్హులైన వారికి డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు: ఎమ్మెల్యే
రూ. 2 లక్షల చెక్కును అందచేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి

జడ్చర్ల/మిడ్జిల్‌/మహబూబ్‌నగర్‌/మూసాపేట/చిన్నచింతకుంట/ మిడ్జిల్‌/గండీడ్‌, జనవరి 21: అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నారు. నిమ్మబావిగడ్డ ప్రాంతంలోని పలు కాలనీల్లో గురువారం ఆయన పర్యటించారు. పాత డ్రైనేజీ స్థానంలో కొత్త డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని మునిసిపల్‌శాఖ అధికారులకు సూచించారు. పాత బజారు ప్రాంతంలో 13 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు. పట్టణం నుంచి ఆలూరుకు వెళ్లే దారిలోని ఫకీర్‌నగర్‌ కాలనీలో కాలనీవాసులు నిర్వహించిన గ్యార్మీ పండుగలో పాల్గొన్నారు. ఇందిరానగర్‌ కాలనీకి చెందిన నీల నరేందర్‌ కుమార్తె వాణి చికిత్స నిమిత్తం రూ.లక్ష ఎన్‌ఓసీని అందజేశారు. అయోధ్యలో రామ్‌ మందిరం రూ.2ల క్షల చెక్కును ట్రస్టు సభ్యులకు ఇచ్చారు. మిడ్జిల్‌ మండలం వెలుగొమ్ముల గ్రామంలో ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్‌ను తన క్యాంపు కార్యలయంలో ప్రారంభించారు. కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, బాదేపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాట్రేపల్లి లక్ష్మయ్య, వీహెచ్‌పీ నాయకులు సురేందర్‌, జగ్‌పాల్‌రెడ్డి, సురేష్‌ పాల్గొన్నారు. 


రామ మందిర నిర్మాణానికి మాజీ ఎంపీ విరాళం

 - రామ మందిరం నిర్మాణం కోసం మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ఆయన మాతృమూర్తి ఏపీ ఈశ్వరమ్మ రూ.1,00,116 నిధిని పాలమూరు విశ్వహిందూ పరిషత్‌ పట్టణ అధ్యక్షుడు విగ్నేశ్‌కు అందజేశారు. గురువా రం ఆయన తన నివాసంలో చెక్‌ అందించారు. అలాగే మూసాపేట మండల కేంద్రంలో ఆంజనేయ అలయ కమిటీ ఆధ్వర్యంలో జన జాగరణ నిధికి శ్రీకారం శ్రీకారం చుట్టారు.


రామమందిర నిర్మాణంలో అందరం భాగస్వాములమవుదాం

 - అయోధ్య రామమందిర నిర్మాణం లో ప్రతి ఒక్క హిందువు భాగస్వామి కావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని దమాగ్నాపూర్‌ గ్రామంలో నిర్వహించిన రామాలయ నిధి సేకరణకు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌, భజరంగ్‌దళ్‌, విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరిగి నిధులు సేకరించారు. అనంతరం దయాకర్‌ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా రామమందిరం నిర్మా ణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. మిడ్జిల్‌ మండలంలో చందా బుక్కులను బీజేపీ జిల్లా కార్యదర్శి రాజేశ్వర్‌, తిరుపతి ఆయా గ్రామాల కమిటీ సభ్యులకు అందజేశారు. అడ్డాకుల మండల రైతుబంధు అధ్యక్షుడు తిరుపతిరెడ్డి రూ.25 వేల చెక్కును, మాపీ ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి రూ.10 వేలు ఇచ్చారు. రామమందిరం నిర్మాణానికి నిధులను అందించాలని గండీడ్‌ ఎంపీపీ మాధవి, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమిరె లక్ష్మయ్య, బీజేపీ నాయకుడు గిరమోని శ్రీనివా స్‌లు అన్నారు. గురువారం రుసంపల్లి, మన్సుర్‌పల్లి గ్రామాల్లో రామ మందిర నిర్మాణానికి నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టారు.







Updated Date - 2021-01-22T03:41:22+05:30 IST