డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఆత్మగౌరవ లోగిళ్లు : రవీంద్ర

ABN , First Publish Date - 2022-05-20T05:51:21+05:30 IST

పేదలు ఆత్మగౌరవంగా బతికేందుకు సీఎం కేసీఆర్‌ డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకం ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే రమా వత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు.

డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఆత్మగౌరవ లోగిళ్లు : రవీంద్ర
డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్ర

చందంపేట, మే 19: పేదలు ఆత్మగౌరవంగా బతికేందుకు సీఎం కేసీఆర్‌ డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకం ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే రమా వత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. మండలంలోని ముడుదండ్లలో రూ.1.88కోట్లతో నిర్మించిన 30 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను గురువారం ప్రారంభిం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ర్టాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ముఖ్య మంత్రి కేసీఆర్‌ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ముడుదండ్ల సర్పంచ్‌ అనురాధ, రమావత్‌ మోహన్‌కృష్ణ, మున్నయ్య, అనంతగిరి, బొడ్డు గోపాల్‌, వేములరాజు, జడ్పీటీసీ పవిత్ర పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ మండల ఉపా ధ్యక్షుడు యాసాని రాజవర్థన్‌రెడ్డి తల్లి అలివేలమ్మ ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. అదేవిధంగా చందంపేటలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథ కాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పార్వతి చం దునాయక్‌, ఆర్డీవో గోపిరాం, నాయకులు మల్లారెడ్డి, సర్వయ్య, గోసుల అనంతగిరి, ఏర్పుల గోవిందుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T05:51:21+05:30 IST