డబుల్‌ గృహప్రవేశాలతో నిజమైన దసరా

ABN , First Publish Date - 2021-10-17T07:18:38+05:30 IST

డబుల్‌ గృహప్రవేశాలతో నిజమైన దసరా

డబుల్‌ గృహప్రవేశాలతో నిజమైన దసరా
టేకులపల్లిలో డబుల్‌బెడ్‌రూం లబ్ధిదారులకు ఇళ్ల స్వాధీన పత్రాలు అందజేస్తున్న మంత్రి

ఒకేరోజు 1,004 ఇళ్ల గృహప్రవేశాలు శుభపరిణామం

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

టేకులపల్లిలో లబ్ధిదారులకు డబుల్‌ఇళ్ల అందచేత

ఖమ్మం కార్పొరేషన్‌, అక్టోబరు 16: ఖమ్మంలోని టేకులపల్లిలో ఒకేరోజు జరిగిన 1,004డబుల్‌ఇళ్ల గృహ ప్రవేశాలతో నిజమైన దసరాపండుగ వచ్చిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. దసరా అంటే చెడుపై మంచి సాధించే విజయం మాత్రమే కాదని, పేద రికంపై సాధించిన అభివృద్ధి సాధించిన విజయమని మంత్రి వ్యాఖ్యానిం చారు. నగరపాలక సంస్థ పరిధిలోని టేకులపల్లిలో పేదలకోసం 42 బ్లాక్‌లలో గ్రౌండ్‌ఫ్లోర్‌తో సహా రెండు అంతస్తులతో నిర్మించిన కేసీఆర్‌ టవర్స్‌లోని 1,004 డబుల్‌బెడ్‌రూంఇళ్లను దసరారోజు శుక్రవారం సాయంత్రం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ లబ్ధిదారులకు అంద జేశారు. అనంతరం మంత్రి వారితో గృహప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ దసరా తన జీవితంలో మరిచి పోలేనిదన్నారు. ఒకేరోజు వెయ్యిమందికిపైగా లబ్ధిదారులకు సొంత ఇళ్లు తన చేతుల మీదుగా అందచేయడం శుభపరిణామమన్నారు. తెలం గాణాలో నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబుల్‌ఇళ్లు నిర్మించి లబ్ధి దారులకు అందచేయటంతో ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల సాకారమైందన్నారు. అన్ని వసతులతో ఒకే చోట ఇళ్లు నిర్మించి ఇవ్వటం వల్ల లబ్ధిదారులకు సౌకార్యాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఓపెన్‌జిమ్‌, పార్కు, రూ.3కోట్లతో విద్యుత్‌ ఉపకేంద్రం, పోలీస్‌ఔట్‌ పోస్ట్‌, విశాలమైన వీధులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, మినీ అంగన్‌వాడీ కేంద్రం, మిషన్‌భగీరథ ఇలా అన్ని వసతులు కల్పించామని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు అందచేశామని, ఇంకా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తిచేసి, దీపావళి నాటికి లబ్ధిదారులకు అందచేస్తామన్నారు. అతి త్వరలోనే సొంతస్థలం ఉన్న పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థికసాయం ప్రభుత్వం అందచేస్తుందన్నారు. ఖమ్మం కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ మాట్లాడుతూ ఇంజనీరింగ్‌, రెవెన్యూ అధికారులు, కాంట్రాక్టర్లు ఎంతో నిబద్దతతో దసరానాటికి నిర్మాణాలు పూర్తిచేసి లబ్దిదారులకు అందించటం అభినందనీయమన్నారు. మంత్రి పువ్వాడ ఆదేశంతో కేసీఆర్‌ టవర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏర్పాటవుతుందన్నారు. అలాగే ఎటువంటి సమస్యలు వచ్చినా, అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్‌ పునుకొల్లు నీరజ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా, డీసీసీబీ, గ్రంథాలయ ఛైర్మన్లు బచ్చు విజయ్‌కుమార్‌, కూరాకుల నాగభూషయ్య, ఖమర్‌, ఏఎంసీ చైర్మన్‌ లక్షీప్రసన్న, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌సురభి, ఉపమేయర్‌ ఫాతిమా జోహారా, ఆర్‌్క్షబీ ఈఈ శ్యాంప్రసాద్‌, పబ్లిక్‌హెల్త్‌ ఈఈ రంజిత్‌కుమార్‌, డీఎం్క్షహెచ్‌వో డాక్టర్‌. మాలతి, జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి సంధ్యారాణి, జిల్లా సహకార శాఖ అధికారి విజయకుమారి, ఆర్డీవో రవీంధ్రనాధ్‌ అర్బన్‌ తహసీల్దార్‌ శైలజ, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T07:18:38+05:30 IST