Advertisement

కరోనా కేసులు తగ్గుతున్నాయా..? తగ్గిస్తున్నారా..?

Sep 16 2020 @ 12:46PM

వనపర్తి జిల్లాలో ఆరు రోజులుగా తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడిస్తున్న వివరాలపై మొదటి నుంచి సందేహాలు

రహస్య సమాచారంగా భావించి వివరాలు వెల్లడించని అధికారులు

రికవరీ, డెత్‌, కాంటాక్టులనూ వెల్లడించతిని వైనం

అన్ని జిల్లాల్లో సమగ్ర బులిటెన్ల విడుదల.. వనపర్తిలో గోప్యత


వనపర్తి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : కరోనా విజృం భణ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ వనపర్తి జిల్లాలో మాత్రం ఆరు రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కేసులు తగ్గడం శుభపరిణామమే అయినప్పటికీ... టెస్టుల సంఖ్య తగ్గించడం.. లేదా పాజిటివ్‌ల వివరాలను సరిగా వె ల్లడించకపోవడం వల్లనే సంఖ్య తగ్గుతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం కరోనాకు ఎలాంటి మందు లూ రాలేదు.. కాంటాక్టుల గుర్తింపును ఎన్నడో మానేశారు. రోడ్లపై ఎలాంటి ఆంక్షలూ లేవు.. భౌతిక దూరం మాట అ టుంచి, మాస్కు కచ్చితమనే నిబంధనను ఎవరూ పాటించ డం లేదు. ఈ పరిస్థితుల్లో కేసుల సంఖ్య తగ్గడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి జిల్లా అధికారులు కరోనా సమాచారం వెల్లడించడంలో అత్యంత గోప్యత పాటిస్తున్నారు. అన్ని జిల్లా యధావిధిగా బులిటెన్‌ లు విడుదల చేస్తుంటే, వనపర్తిలో మాత్రం రహస్య సమా చారం అన్నట్లుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వస్తు న్నాయి. వివరాలు సరిగా వెల్లడించాలని వివిధ సంఘాల నాయకులు, పార్టీల ప్రతినిధులు, మీడియా పలుమార్లు కో రినా.. నిమ్మకు నీరెత్తనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. రోజూ నమోదవుతున్న కరోనా కేసుల వివరాలను మాత్రమే మొక్కుబడిగా పోస్టు చేస్తున్నారు. 


వనపర్తి జిల్లాలో మే చివరి వారం నుంచి కరోనా ప్రభా వం మొదలైంది. అప్పటి నుంచి సోమవారం నాటికి 3517 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 36 మరణా లు, 2,299 రికవరీలు నమోదు కాగా, 1,182 మంది యాక్టి వ్‌ రోగులు ఉన్నారు. రోజు వారీగా అధికారులు ఆ రోజు న మోదైన కేసులతో పాటు మరణాలు, రివకరీలు వెల్లడించా లి. దీంతో పాటు ఓవరాల్‌ రిపోర్టును కూడా వెల్లడించడం లేదు. చిన్నంబావి మండలం పెద్దదగడలో 120 కేసులు న మోదైనా, ఇప్పటివరకు ఆ సంఖ్యను తక్కువగానే చూపిస్తు న్నారు. సమాచారం అడిగినా వెల్లడించకపోవడం.. అంతు లేని గోప్యత పాటిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియక.. జ న సంచారం మరింత ఎక్కువగా అవుతుంది. భౌతికదూ రం, మాస్కులు ధరించడం, శానిటైజేషన్‌ కూడా మానేస్తే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. ఇప్పటికైనా కరోనా పై వాస్తవ సమాచారాన్ని అధికారులు వెల్లడించాల్సిన అవ సరముందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.


349 కొత్త కేసులు.. రెండు రోజులుగా తగ్గుతున్న కరోనా కేసులు

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. తాజాగా మంగళవారం 349 కేసులు మాత్రమే నమోదయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒకరు మృతి చెందారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 108 కరోనా కేసులు నమోదయ్యాయి. అం దులో జిల్లా కేంద్రంలో 45 మందికి వైరస్‌ సోకగా, వివిధ మండలాల్లో 63 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 


జోగుళాంబ గద్వాల జిల్లాలో 64 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అందులో జిల్లా కేంద్రంలో 14 కేసులు నమోదయ్యాయి. వివిధ మండలాల్లో 50 మంది వైరస్‌ బారిన పడ్డారు. గద్వాల పట్టణంలోని కొవిడ్‌ వార్డులో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. నారాయణపేట జిల్లాలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. జిల్లా కేంద్రంలో ఒకరికి, కోస్గిలో ఇద్దరికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. 


వనపర్తి జిల్లాలో 71 కేసులు నమోదయ్యాయి. అందులో వనపర్తి మండలంలో 36 మందికి కరోనా సోకగా, ఇతర మండలాల్లో 35 మంది బాధితులున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 103 కేసులు నమోదయ్యాయి. అందులో ఎక్కువగా నాగర్‌కర్నూల్‌ మండలంలో 35, అచ్చంపేటలో 14 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మరో 54 కేసులు ఇతర మండలాల్లో నమోదయ్యాయి.


Follow Us on:
Advertisement
Advertisement