టెండరు వద్దు..నామినేట్‌ ముద్దు!

ABN , First Publish Date - 2021-05-20T05:23:10+05:30 IST

ముత్యాలమ్మ కోనేరు-నెహ్రూ పార్కు అధునికీకరణ పనుల విషయంలో అధికారుల వ్యవ హరించిన తీరుపై విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. పనులు చేయకుండానే రూ.30 లక్షల బిల్లులు ముందుగానే చెల్లించడం, కాంట్రా క్టర్లు మధ్యలో పనులు నిలిపివేయడంపై ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం ప్రచురి తమైన ‘ఆపేశారు ఎందుకో’ కథనం జంట పట్టణాల్లో చర్చనీయాంశమైంది. పార్కు పనుల కేటాయింపులో కొత్త విష యాలు బయటకు వస్తున్నాయి. పెద్ద పనులకు సంబంధించి నామినేట్‌ పద్ధతి పై ఒకే గుత్తేదారుడికి అప్పగిస్తే ముం దుకే

టెండరు వద్దు..నామినేట్‌ ముద్దు!
పార్కులో మూలకు చేరిన పరికరాలు


 పనులు విడగొట్టి అప్పగింత

 స్థానికులకు కాదని జిల్లాయేతర కాంట్రాక్టర్‌కు పెద్దపీట

 ముందస్తు చెల్లింపులపై శ్రద్ధ 

 అధికారుల తీరుపై అనుమానాలు

 ‘ఆంధ్రజ్యోతి’ కథనం..చర్చనీయాంశం

పలాస, మే 19: ముత్యాలమ్మ కోనేరు-నెహ్రూ పార్కు అధునికీకరణ పనుల విషయంలో అధికారుల వ్యవ హరించిన తీరుపై విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. పనులు చేయకుండానే రూ.30 లక్షల బిల్లులు ముందుగానే చెల్లించడం, కాంట్రా క్టర్లు మధ్యలో పనులు నిలిపివేయడంపై ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం ప్రచురి తమైన ‘ఆపేశారు ఎందుకో’ కథనం జంట పట్టణాల్లో చర్చనీయాంశమైంది. పార్కు పనుల కేటాయింపులో కొత్త విష యాలు బయటకు వస్తున్నాయి.  పెద్ద పనులకు సంబంధించి నామినేట్‌ పద్ధతి పై ఒకే గుత్తేదారుడికి అప్పగిస్తే ముం దుకే మోసమని భావించారో ఏమో కానీ పనులు విడగొట్టారు.  సింహభాగం పనులను కృష్ణా జిల్లాకు చెందిన ఓ కాంట్రా క్టర్‌కు కట్టబెట్టారు. మిగిలిన పనులను స్థానిక కాంట్రాక్టర్లకు కేటాయించారు. 20 శాతం పనులు కాకుండానే కేటాయించిన నిధుల్లో సగాన్ని బిల్లుల రూపంలో చెల్లించారు. తాగునీరు, పారిశుధ్య, వీధి లైట్ల నిర్వహణకు వినియోగించే సాధార ణ నిధులను తీసి చెల్లించారంటే కాంట్రాక్టర్లపై ఉన్న శ్రద్ధ తెలియజేస్తోంది. అక్కడితో ఆగకుండా 14వ ఆర్థిక సంఘం నిధులను సైతం సర్దుబాటు చేశారు. పోనీ నిధులు మంజూరుచేశారని సదరు కాంట్రాక్టర్లు పనులు సజావుగా చేశారంటే అదీ లేదు. మధ్యలో పనులు నిలిపివేసి వెళ్లిపోయారు. 


విచారణ జరపాలి..

వాస్తవానికి మునిసిపాల్టీతో పాటు జిల్లాలో కోటి రూపాయలు విలువైన పను లు చేయడానికి పదుల సంఖ్యలో కాంట్రాక్టర్లు ఉన్నారు. అటువంటి వారికి పను లు కేటాయిస్తే సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ స్థానికేతర కాంట్రా క్టర్‌కు పెద్దపీట వేయడం ఇప్పుడు అనుమానాలకు కారణమవుతోంది. ఏడాదిగా పనులు ఆగిపోవడంతో స్థానిక వాకర్స్‌, ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు పార్కు అభివృద్ధి చేయాలన్న డిమాండ్‌ ప్రజల నుంచి లేదు. నిత్యం పచ్చదనంతో జంట పట్టణవాసులకు పార్కు ఆహ్లాదం పంచేది. కానీ అధికారులు ఆధునికీకరణకు ఆలోచన చేశారు. మంచిదే అయినా పనులు పూర్తి చేయించడంలో మాత్రం చొరవచూపలేకపోయారు. అడ్వాన్స్‌ రూపంలో మాత్రం నిధులను అప్పగించారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాలకవర్గం లేని సమయంలో టెండర్లకు పిలువకుండా నామినేటెడ్‌ పద్ధతిపై పనులు జరపడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని జంట పట్టణవాసులు కోరుతున్నారు. వీలైనంత త్వరగా పార్కు ఆధునికీకరణ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.





Updated Date - 2021-05-20T05:23:10+05:30 IST