పంచాయతీ కార్యదర్శిపై డీపీఓ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-08-19T06:32:40+05:30 IST

గ్రామసభ తీర్మానాలు, పాలకవర్గ తీర్మానాల్లో ఖాళీలుండడంతో డీపీవో శిరీషారాణి పంచాయతీ కార్యదర్శి రాధారాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంచాయతీ కార్యదర్శిపై డీపీఓ ఆగ్రహం
రికార్డులు తనిఖీ చేస్తున్న డీపీఓ శిరిషారాణి


బుచ్చెయ్యపేట, ఆగస్టు 18: గ్రామసభ తీర్మానాలు, పాలకవర్గ తీర్మానాల్లో ఖాళీలుండడంతో డీపీవో శిరీషారాణి పంచాయతీ కార్యదర్శి రాధారాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం దిబ్బిడి పంచాయతీ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. రికార్డులో లోపాలను గుర్తించిన శిరీషారాణి కార్యదర్శిపై మండిపడ్డారు. అవగాహన రాహిత్యం వలనే మినిట్‌ పుస్తకం సరిగ్గా మెయింటెన్‌ చేయలేకపోయానని, ఇటువంటి లోపాలు మరోసారి చోటుచేసుకోకుండా వ్యవహరిస్తానని కార్యదర్శి రాధారాణి కోరడంతో రికార్డును అప్‌డేట్‌ చేయాలని డీపీఓ ఆదేశించారు. ఆర్‌బీకే భవన నిర్మాణం పునాదుల స్థాయిలో ఉండడంపై డీపీఓ అసంతృప్తి వ్యక్తం చేశారు.  

Updated Date - 2022-08-19T06:32:40+05:30 IST