డేగపూడిలో పారిశుధ్యం మెరుగుపరుస్తాం

ABN , First Publish Date - 2022-06-28T05:17:07+05:30 IST

మండలంలోని డేగపూడిలో పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తామని జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్షి తెలిపారు.

డేగపూడిలో పారిశుధ్యం మెరుగుపరుస్తాం
డేగపూడిలో జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్షి

జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి

పొదలకూరు, జూన్‌ 27 : మండలంలోని డేగపూడిలో  పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తామని జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్షి తెలిపారు. ఈ నెల 25న విషజ్వరాలతో డేగపూడి విలవిల అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో సోమవారం ఆమె మండల అధికారులతో కలిసి గ్రామాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో నీటి, లార్వా నిల్వలు లేకుండా చేస్తామన్నారు. అధికారుల మానిటరింగ్‌తో ఐదు రోజుల్లో విషజ్వరాలను అదుపులో తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామంలోని బావి  నీటిని వాడకుండా సీజ్‌ చేయాలని పంచాయతీ సెక్రటరీకి సూచించారు. గ్రామ సమీపంలో ఉన్న దొరువులో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపే  మార్గాన్ని చూడాలన్నారు. గ్రామ స్థుల ఆరోగ్యం నిలకడ అయ్యేవరకు మహమ్మదాపురం డాక్టర్‌ రమేష్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం, రక్తపరీక్షలు, మందులు పంపిణీ జరుగుతుందన్నారు. గ్రామస్తులందరూ రక్తపరీక్షలు చేయించుకోవాలని, దోమతెరలు వాడాలని, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దారు వి.సుధీర్‌, ఈవోపీఆర్‌డీ నారాయణరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కసా నాయక్‌, ఎంపీటీసీ, సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శిలు ఉన్నారు.

సీహెచ్‌సీని పరిశీలించిన డీసీహెచ్‌ఎస్‌

 పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని నెల్లూరు డీసీహెచ్‌ఎస్‌ రమేష్‌నాథ్‌ సోమవారం  పరిశీలించారు. అలాగే మండలంలోని విష జ్వరాలతో బాధపడుతున్న డేగపూడి గ్రామాన్ని పరిశీలించి తగు సూచనలు చేశారు. ఆయన వెంట మహమ్మదాపురం పీహెచ్‌సీ డాక్టర్‌ రమేష్‌ ఉన్నారు. 

Updated Date - 2022-06-28T05:17:07+05:30 IST