ప్రతాప్ సింగారంలో పర్యటిస్తున్న డీఆర్‌డీవో జ్యోతి
ఘట్‌కేసర్ రూరల్: రైతుల ప్రయోజనాలకై ప్రభుత్వం మంజూరు చేసిన కల్లాలను ప్రతి రైతు ఏర్పాటు చేసుకోవాలని డీఆర్‌డీవో అధికారి జ్యోతి సూచించారు. మండల పరిధి ప్రతాప్ సింగారం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాలను ఆమె శనివారం పరీశీలించారు. ధాన్యాన్ని మట్టిలో పోయకుండా కల్లాల్లో పోయాలని, ప్రభుత్వం రాయితీతో ఏర్పాటు చేస్తున్న కల్లాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో పరిమళ తదితరులు పాల్గొన్నారు.