అనాథ యువతికి వివాహం.. పెద్దమనసు చాటుకున్న డాక్టర్ ముక్కామల!

Published: Tue, 16 Aug 2022 20:16:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అనాథ యువతికి వివాహం.. పెద్దమనసు చాటుకున్న డాక్టర్ ముక్కామల!

ఎన్నారై డెస్క్: అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు, దాత డాక్టర్ ముక్కామల అప్పారావు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తానే పెళ్లి పెద్దగా వ్యవహరిస్తూ ఒక అనాథ మహిళకు వివాహం జరిపిస్తున్నారు. డాక్టర్ ముక్కామల అప్పారావు.. విజయవాడకు సమీపంలోని కాజా గ్రామంలో చిన్మయ విజయ పేరుతో చాలా సంవత్సరాల నుండి ఒక అనాథ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. ఈ ఆశ్రమంలోనే విమల అనే అనాథ యువతి బాల్యం గడిచింది. అక్కడే ఆమె చదువుకున్నారు. విమలకు యుక్తవయస్సు రావటంతో ఆమెకు పెళ్లి చేసే బాధ్యతను డాక్టర్ అప్పారావు దంపతులు స్వీకరించారు. బుధవారం ఉదయం ఆశ్రమం ఆవరణలో రమేష్ అనే యువకుడితో విమల వివాహం పెద్ద ఎత్తున నిర్వహించడానికి డాక్టర్ అప్పారావు ఏర్పాట్లు చేశారు. తమ సొంత కుమార్తె వివాహం లాగానే విమల వివాహ బాధ్యతను డాక్టర్ అప్పారావు దంపతులు స్వీకరించారు. ఈ మేరకు పెళ్లి పత్రికలను రూపొందించి బంధువులు, సన్నిహితులకు ఆహ్వానాలు పంపారు. చిన్మయ మిషన్‌కు చెందిన ప్రముఖ స్వామీజీలు ఈ పెళ్లి వేడుకలకు హాజరు అవుతున్నారు.  


అనాథ యువతికి వివాహం.. పెద్దమనసు చాటుకున్న డాక్టర్ ముక్కామల!



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.