ఆయుర్వేద దిగ్గజం డాక్టర్ పీకే వారియర్ కన్నుమూత

ABN , First Publish Date - 2021-07-10T23:19:44+05:30 IST

ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, కోట్టక్కల్ ఆర్య వైద్యశాల (కేఏఎస్) మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్..

ఆయుర్వేద దిగ్గజం డాక్టర్ పీకే వారియర్ కన్నుమూత

న్యూఢిల్లీ: ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, కోట్టక్కల్ ఆర్య వైద్యశాల (కేఏఎస్) మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పీకే వారియర్ శనివారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 100 సంవత్సరాలు. మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబవర్గాలు తెలిపాయి. భారత ప్రభుత్వం ఆయనను 1999లో పద్మశ్రీ, 2010లో పద్మ భూషణ్ పురస్కారంతో సన్మానించింది.


ఆయుర్వేద చికిత్సకు ప్రపంచ వ్యాప్త ప్రచారం తీసుకువచ్చి, సామాన్య ప్రజానీకానికి సైతం చేరవేసిన డాక్టర్ వారియర్ జూన్ 8న జన్మదినోత్సవం జరుపుకొన్నారు. 1921 జూన్ 5న జన్మించిన పీకే వారియన్ కోట్టక్కల్‌లో పాఠశాల విద్య నేర్చుకుని, 20 ఏళ్ల ప్రాయంలో కేఏఎస్‌లో చేరారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో స్వాతంత్ర్య పోరాటం పట్ల ఆకర్షితుడై ఆయుర్వేద విద్యను విడిచిపెట్టి అందులో పాల్గొన్నారు. అయితే క్రియాశీలక రాజకీయాలు తనకు పడవని గ్రహించి ఆ తర్వాత తిరిగి ఆయుర్వేద విద్యను కొనసాగించారు. విద్యాభ్యాసం పూర్తి కాగానే 24 ఏళ్ల వయస్సులోనే కేఏసీ ట్రస్టీగా చేరారు.

Updated Date - 2021-07-10T23:19:44+05:30 IST