కొనసాగుతున్న ‘రమేష్‌’ విచారణ

ABN , First Publish Date - 2020-12-02T06:33:09+05:30 IST

స్వర్ణప్యాలెస్‌ ఘటనలో నిర్వహించిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి డాక్టర్‌ పోతినేని రమేష్‌బాబును పోలీసులు విచారిస్తున్నారు.

కొనసాగుతున్న ‘రమేష్‌’ విచారణ

విజయవాడ, డిసెంబర్‌ 1(ఆంధ్రజ్యోతి) : స్వర్ణప్యాలెస్‌ ఘటనలో నిర్వహించిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి డాక్టర్‌ పోతినేని రమేష్‌బాబును పోలీసులు విచారిస్తున్నారు. రెండో రోజైన మంగళవారం స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌ యాజమాన్యం, రమేష్‌ ఆస్పత్రికి మధ్య జరిగిన ఎంవోయూతోపాటు కలెక్టర్‌, వైద్యఆరోగ్యశాఖాధికారి అనుమతు లపై పోలీసులు ఆరా తీశారు. హోటల్‌ ఫైర్‌ సేఫ్టీ పైనా ప్రశ్నిం చారు. కలెక్టర్‌, డీఎంహెచ్‌వో అనుమతుల పత్రాలను పోలీసులు పరిశీలించారు. ప్రమాదం తర్వాత పోలీసులు జారీ చేసిన సీఆర్‌ పీసీ 91 ప్రకారం నోటీసులు తీసుకున్నప్పటికీ రమేష్‌బాబు విచా రణకు హాజరుకాలేదు. దీనిపైనా ఆయనను ప్రశ్నించారు. నోటీసు అందుకున్న వెంటనే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహణకు సంబంధిం చిన అన్ని పత్రాలు పోలీసులకు అందజేశానని రమేష్‌బాబు చెప్పారు. హోటల్‌కు ఫైర్‌ సేఫ్టీ ఉందా లేదా.. ఆ విషయాన్ని ఉన్న తాధికారుల దృష్టికి తీసుకెళ్లారా లేదా అని  ప్రశ్నించారు. తాము కేవలం కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ వరకు మాత్రమే బాధ్యత వహించా మని, హోటల్‌ సదుపాయాలను యాజమాన్యం చూడాలని రమేష్‌ సమాధానమిచ్చారు. సెంటర్‌ నిర్వహణ విషయంలో ఒప్పంద పత్రాలపై తాము సంతకాలు చేసి హోటల్‌ యాజమాన్యానికి ఇచ్చామని, తిరిగి ఆ కాపీలను వారు తమకివ్వలేదని పోలీసులకు రమేష్‌ వివరించారు. బుధవారంతో రమేష్‌బాబు విచారణ ముగుస్తుంది. ఈ విచారణలో రమేష్‌బాబు చెప్పిన విషయాలను ఛార్జిషీటులో పొందుపరుస్తారని సమాచారం.

Updated Date - 2020-12-02T06:33:09+05:30 IST