రానున్న రోజుల్లో... అమెరికాలో Dr. Reddy's కొత్త లాంచ్‌లు

ABN , First Publish Date - 2022-05-20T21:22:05+05:30 IST

నాలుగో త్రైమాసికం ఫలితాల తర్వాత Dr. Reddy's షేర్లు 8 శాతానికి పైగా పెరిగాయి.

రానున్న రోజుల్లో...  అమెరికాలో Dr. Reddy's కొత్త లాంచ్‌లు

హైదరాబాద్ : నాలుగో త్రైమాసికం ఫలితాల తర్వాత Dr. Reddy's షేర్లు 8 శాతానికి పైగా పెరిగాయి. ఆర్ధికసంవత్సరం నాలుగో త్రైమాసికంలో 14.8 % ఆదాయ వృద్ధిని నమోదు చేసినట్లు యాక్సిస్ సెక్యూరిటీస్ వెల్లడించింది. US, India సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో సంతృప్తికరమైన ఫలితాల నేపథ్యంలో ఈ ఫలితాలను సాధించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. నాలుగో త్రైమాసికం ఫలితాల తర్వాత  Dr. Reddy's షేర్లు 8 % పైగా పెరిగాయి. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఫలితాలను ప్రకటించిన తర్వాత  Dr. Reddy's Laboratories(DRL) షేర్లు BSEలో ఇంట్రాడే గరిష్ట స్థాయి(రూ. 4259.10)కి చేరుకున్నాయి.


కిందటి త్రైమాసికంలో రూ. 742 కోట్ల వన్-టైమ్ ఇంపెయిర్‌మెంట్ ఖర్చులను బుక్ చేయడంతో ఏడాది ప్రాతిపదికన 76 శాతం తగ్గి, రూ. 88 కోట్ల నికర లాభాన్ని కంపెనీ నమోదు చేసింది. ఏదేమైనప్పటికీ... ఆదాయాలు సంవత్సరానికి 15 శాతం పెరిగి, రూ. 5,437 కోట్లకు చేరుకున్నట్లు Dr. Reddy's Laboratories నివేదించింది. రూ. 70 వేల కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో, షేర్లు 5/20/50-రోజుల సగటుల కంటే ఎక్కువగా ఉన్నాయి. కాగా... 100/200 రోజుల చలన సగటు కంటే తక్కువగా ఉన్నాయి.


Dr. Reddy's Laboratories ప్రస్తుతం దీర్ఘకాలికంగా వృద్ధినందించే పలు వ్యాపారాలలో పెట్టుబడి పెడుతోంది. ఇక మరోవైపు... బయోసిమిలర్‌ల గ్లోబల్ పైప్‌లైన్‌లను కంపెనీ నిర్మిస్తోంది.  immuno-oncology కోసం NCE అభివృద్ధి, neutraceuticals పోర్ట్‌ఫోలియో, టీకాలు, CDMO సహా digital healthcare ప్లాట్‌ఫారమ్‌లను నిర్మిస్తోంది. ‘కాగా... అధిక ద్రవ్యోల్బణం మార్జిన్‌లను తగ్గించవచ్చు, దీని వలన టార్గెట్ ధరను షేరుకు రూ. 4,500/ తగ్గించడానికి దోహదం చేస్తుంది’ అని బ్రోకరేజ్ పేర్కొంది. Dr. Reddy's Laboratories డాక్టర్ రెడ్డీస్ 2022 ఆర్ధికసంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలు America, India ఆదాయాలు ఆరోగ్యకరంగా ఉన్నాయని,  స్థిరమైన ఆదాయాల ఊపందుకుంటున్నామని, US generic వ్యాపారంలో వ్యయం ఆప్టిమైజేషన్‌తో పాటు పుంజుకుంటాయని కంపెనీ భావిస్తోంది. అలాగే, బలమైన పైప్‌లైన్/కొత్త లాంచ్‌లు India సహా  RoW మార్కెట్లలో స్థిరమైన వృద్ధిని అందిస్తాయని భావిస్తున్నారు. కాగా... ICICI సెక్యూరిటీస్ బ్రాండెడ్ జనరిక్స్ వ్యాపారంలో వృద్ధి ఊపందుకుంటోందని, రానున్న త్రైమాసికాల్లో USలో కొత్త లాంచ్‌లు కొనసాగుతాయని ఆశిస్తోంది.

Updated Date - 2022-05-20T21:22:05+05:30 IST