కరోనాతో కన్నుమూసిన డాక్టర్‌ శ్రీలక్ష్మి

ABN , First Publish Date - 2021-05-09T05:28:00+05:30 IST

కరోనాతో కన్నుమూసిన డాక్టర్‌ శ్రీలక్ష్మి

కరోనాతో కన్నుమూసిన డాక్టర్‌ శ్రీలక్ష్మి
డాక్టర్‌ శ్రీలక్ష్మి (ఫైల్‌)

ఇబ్రహీంపట్నం: టీఆర్‌ఎస్‌ నాయకురాలు డా. శ్రీలక్ష్మి(48) కరోనాతో శనివారం సాయంత్రం కన్నుమూశారు. మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి ఇబ్రహీంపట్నంలో రామరక్షా హాస్పిటల్‌ డైరెక్టర్‌గా ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నారు. కాగా కరోనా బారినపడిన ఆమె చికిత్స నిమిత్తం వారం క్రితం నగరంలోని మలక్‌పేట్‌ యశోదా హాస్పిటల్‌లో చేరారు. చికిత్స పొందుతూనే శనివారం సాయంత్రం కన్నుమూశారు. శ్రీలక్ష్మి భర్త డా. సుజన్‌రెడ్డి కూడా వైద్యవృత్తిలో ఉన్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా ఆమె 2019 మేలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో మంచాల మండలం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. డా. శ్రీలక్ష్మి మృతిపట్ల ఎమ్యెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డితోపాటు పలువురు నాయకులు సంతాపం వెలిబుచ్చారు. 

కరోనాతో మరొకరు మృతి

చౌదరిగూడ: కరోనాతో శనివారం మరో వ్యక్తి మృతిచెందారు. చౌదరిగూడ మండల పరిధిలోని పెద్దఎల్కిచర్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పది రోజులక్రితం జ్వరం రావడంతో అనుమానం వచ్చి కరోనా టెస్టు చేయించుకున్నట్లు కుంటుంబసభ్యులు తెలిపారు. కాగా అతడికి పాజిటివ్‌ రావడంతో షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి డాక్టర్‌ సలహాతో మందులు వాడుతున్నట్లు తెలిపారు. రెండు రోజులక్రితం ఆరోగ్యం క్షీణించడంతో హైద్రాబాద్‌లోని టిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. మృతుడు గతంలో మహబూబ్‌నగర్‌ మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడిగా చురుకైన బాధ్యతలు నిర్వహిస్తూ భార్యను ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. కాగా ఆయన మృతికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ సంతాపం తెలిపారు.

Updated Date - 2021-05-09T05:28:00+05:30 IST